కాస్కో..శ్వేతాబసు
కొత్త బంగారులోకం,రైడ్ చిత్రాలతో యువతలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న శ్వేతాబసు తాజాగా కాస్కో అనే చిత్రంలో చేస్తోంది.వైభవ్ హీరోగా చేస్తన్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. భారతి నిర్మాత. చిత్ర సమర్పకుడు ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ "జీవితం విలువ తెలిసిన యువకుడు మా కథానాయకుడు. అల్లరి వ్యవహారాలకు అతని దినచర్యలో చోటులేదు. ఎదుటివాడు ఎంతటివాడైనా తేడా వస్తే 'కాస్కో' అని సవాలు విసరడమే అతనికి తెలుసు. అలా విసిరిన సవాల్ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? అనేది సస్పెన్స్. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో పాటల్ని, సినిమానీ విడుదల చేస్తామ"ని అన్నారు.
ఇక దర్శకుడు నాగేశ్వరరెడ్డి సీమశాస్త్రి చిత్రం అనంతరం రూపొందిస్తున్న చిత్రం ఇది. అలాగే వైభవ...సరోజ చిత్రం తర్వాత చేసిన చిత్రం ఇది. శ్వేతాబసు..తన రైడ్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ఇది. కోదండరామిరెడ్డి పున్నమినాగు అనంతంరం నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇక కాస్కో చిత్రానికి గౌరీపండిట్, జయప్రకాష్‌రెడ్డి, ప్రదీప్‌రావత్, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: ప్రేమ్‌జీ, సహ నిర్మాత: ఎ.సునీల్, ఛాయాగ్రహణం: అఖిలన్. అలాగే శ్వేతాబసు ఈ సినిమాతో పాటు ఉదయ్‌కిరణ్ సరసన మరో సినిమాలో కనిపించనున్నది.


Click it and Unblock the Notifications











