ఆ హీరోతో నాకు కెమిస్ట్రీ బాగా కుదిరింది:శ్వేతాబసు
ఎ..క్క..డ అంటూ కొత్త బంగారులోకం తో పరిచయమైన శ్వేతాబసు రెండో చిత్రం రైడ్ కే కుర్రకారు కలల రాణిగా మారింది. ఆమె ప్రస్తుతం కళావర్ కింగ్ అనే చిత్రంలో నిఖిల్ సరసన చేస్తోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..తనకీ, నిఖిల్‌కీ మధ్య ఈ సినిమాలో కెమెస్ట్రీ బాగా కుదిరిందనీ, అందరూ ఈ సినిమాని ఎంజయ్ చేస్తారనీ శ్వేతాబసు చెప్పారు. అలాగే నిఖిల్ మాట్లాడుతూ.."టైటిల్‌కి తగ్గట్లే నా పాత్ర కలర్‌ఫుల్‌గా ఉంటుంది'' అన్నారు.శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ద్వారా తమిళుడైన సురేశ్ తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సాయికృష్ణ ప్రొడక్షన్ పతాకంపై డి.ఎస్. రావు, చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి.ఎస్.రావు గతంలో ఒక పెళ్ళాం వద్దు రెండో పెళ్లాం ముద్దు, మహారాజశ్రీ,ద్రోణ వంటి చిత్రాలు నిర్మించారు. నిఖిల్ ..హ్యాపీడేస్ చిత్రంలో పరిచయమై యువత సినిమాతో నిలదొక్కుకున్నాడు.శ్వేతాబసు నటించిన కాస్కో చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వైభవ్ హీరోగా సీనియర్ దర్శకుడు కోదండరామరెడ్డి ఆ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











