నందమూరి హీరో సరసన శ్వేతాబసు ఎంపిక

By Srikanya

హైదరాబాద్ : కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుంది. బాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమె తాజాగా మరో చిత్రంలో ఎంపికైంది.
తారకరత్న హీరోగా వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న చిత్రం 'విజేత లో ఆమె హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోంది. ఉదయ్‌భాస్కర్ దర్శకుడు.

ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...''నాగార్జున నటించిన 'కిరాయిదాదా'తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను. నందమూరి తారకరత్నతో ఇప్పుడు తీస్తున్న 'విజేత' నిజంగా అతన్ని విజేతగా నిలుపుతుంది'' అన్నారు. వీఎంసీ కంబైన్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్న 'విజేత' చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తారకరత్న మాట్లాడుతూ ...వి.ఎం.సి సంస్థలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతని ఆకట్టుకునే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'జూ.ఎన్టీఆర్‌తో 'సింహాద్రి' వంటి విజయవంతమైన సినిమాను అందించిన సంస్థ ఇప్పుడు తారకరత్నతో చేస్తున్న 'విజేత' కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుంది. ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది' అన్నారు.

తారకరత్న, శ్వేతాబసుప్రసాద్, భానుశ్రీ మెహ్రా ఇందులో నాయకానాయికలు. ముహూర్తపు దృశ్యానికి టి.ప్రసన్నకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ -''నేనింతవరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది'' అని చెప్పారు. సెప్టెంబరు వరకూ ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతామని బ్యాంకాక్, అరకులోయల్లో పాటలు చిత్రీకరిస్తామని కార్యనిర్వాహక నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X