శ్వేతాబసుకి ఒళ్ళు అందుకే..
రైడ్ చిత్రం చూసినవాళ్ళంతా సినిమా గురించి మాట్లాడటం మానేసి అందులో నటించిన శ్వేతా బసు గురించి చర్చల్లో పడుతున్నారు. అదీ ఆమె నటన గురించి కాదు..ఆమె విపరీతంగా పెంచిన ఒళ్ళు గురించి. కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమై కుర్రకారుని ఊరించిన శ్వేతా బసు ప్రసాద్ ని లేటెస్ట్ గా చూసిన వాళ్ళు షాకవుతున్నారు. క్యూట్ గా ఉన్న ఈ చిన్నది హఠాత్తుగా నమిత షేప్ లతో బరువెక్కటంతో ఆశ్చర్యపోతున్నారు.
దాంతో ఆమెను జూనియర్ నమిత కొంతమంది పిలుస్తున్నా ఆమె కెరీర్ కి ఇది పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. కొత్త బంగారు లోకం రిలీజవగానే ఆమెకు ఆఫర్స్ ముంచెత్తాయని అయితే ఏరి కోరి ఈ చిత్రం చేయటంతో మిగతా ఆఫర్స్ వెనక్కి వెళ్ళాయి. దాంతో ఇప్పుడు ఆమెను సంప్రదిద్దమనుకున్నా ఆమె ఒళ్ళును చూసి వెనక్కి తగ్గుతున్నారు. అయితే సౌత్ లో ముఖ్యంగా తమిళ, తెలుగులలో బొద్దుగా ఉండేవారు నయనతార, నమితలలా దూసుకుపోతారని ఆమె నమ్మటమే ఈ ఒళ్ళుకు కారణమని చెప్తున్నారు.
దాంతో డైట్ విషయంలో కొద్దిగా కూడా కంట్రోలు లేకపోవటం, డైలీ ఎక్సర్ సైజ్ చేయకపోవటం జరిగిందని దాంతో అసలు షేప్ అవుట్ అయ్యే పరిస్ధితి వచ్చిందని వాపోతున్నారు. అందులోనూ కెరీర్ నిలబడటానికి ఎక్సపోజింగ్ కూడా అవసరమని నమ్మే...రైడ్ లో రెచ్చిపోయిందని చెప్తున్నారు. ఆ పోస్టర్స్ ఇప్పుడు యూత్ ని ధియోటర్స్ కి లాగుగలుగుతున్నాయని, తను సక్సెస్ అయ్యిందని ఆమె సంతోషంలో ఉందని సమాచారం. అయితే ఇలాగే అడ్డు అదుపు లేకుండా ఒళ్లు పెంచితే త్వరలోనే ఫేడవుట్ అయ్యే అవకాశం కూడా ఉందని కొందరు సీనియర్స్ హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











