twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త బంగారం శ్వేత బసు మళ్ళీ...

    By Staff
    |

    Swetha Prasad
    'కొత్త బంగారులోకం' హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్‌ ని మర్చిపోవటం కష్టమే. అందుకే ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె హీరోయిన్ గా ఓ ప్రేమ కధా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది.కొత్తగా పరిచయం అవుతున్న బాలాజీ ఎన్‌.సాయి దర్శకత్వంలో రత్నా సెల్యులాయిడ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత జక్కం జవహర్‌బాబు మాట్లాడుతూ ''ప్రేమ భావనలు నిండిన కథ ఇది. ఇలాంటి కథాంశంతో ఎవరూ చిత్రం తీయలేదు.

    యుక్త వయసులో ఉన్నవారి మనోభావాలు తెరపై కనిపిస్తాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు శ్రీరాఘవ స్వరాలు సమకూరుస్తున్నారు. కథానాయకుడెవరు అనేది త్వరలో ప్రకటిస్తామ''న్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, రఘుబాబు, ధర్మవరపు, కృష్ణభగవాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: పోతిన శ్రీనివాసరావు, కెమెరా: రవి, కూర్పు: శంకర్‌, కళ: నారాయణరెడ్డి.రకరకాల కథలు విన్న తర్వాతే ఈ టీనేజ్ లవ్ స్టోరీ కథ కూడా విని నచ్చి శ్వేత ఒప్పుకుందని తెలుస్తోంది. బెస్టాఫ్ లక్ శ్వేత.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X