twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాకు శ్వేతాబసు 'ఓపెన్ లెటర్': అందులో ఏముంది?

    By Srikanya
    |

    హైదరాబాద్: వ్యభిచార సంబంధ కేసులోకి మీడియా తనను తప్పుగా లాగిందంటూ సినీనటి శ్వేతాబసుప్రసాద్‌ ఓ బహిరంగ లేఖలో ఆరోపించారు. మీడియాకు సంబంధించిన ఉదంతాలు తనను విషాదానికి గురిచేశాయన్నారు. జరిగినదంతా మరచిపోయి జీవితంలో ముందుకు సాగాలని భావిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆమె ఓపెన్ లెటర్ రాసారు.

    ఇటీవల ఓ వ్యభిచార సంబంధ రాకెట్‌ వెలుగులోకి రాగా.. ఆ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఆమెను పునరావాస సదనానికి తరలించిన సంగతి తెలిసిందే. సదరు కేసులో ఈనెల 5న నాంపల్లి మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించి, అభియోగాల్ని ఉపసంహరించి, విచారణ కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆమె తాజాగా ట్విటర్‌ఖాతాలో బహిరంగ లేఖను పోస్టు చేశారు.

    సంఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే కథనాలు వెలువడ్డాయన్నారు. తప్పుడు ప్రకటనలు చేసిన వారినీ, వాస్తవాలను నిర్ధరించుకోకుండా తప్పుదోవ పట్టించే కథనాలను ప్రోత్సహించిన వారినీ వదిలేస్తున్నానన్నారు. ఈ ఉదంతానికి ఇంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం అవసరం లేనందునే జరిగినదాన్నంతా వదిలేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

    ఆ లేఖలో ఆమె ఏమన్నారంటే..

    Swetha Basu Prasad's open letter to the media

    ''గొప్ప పాత్రికేయులను ఆరాధిస్తూ నేను పెరిగాను. అదే మీడియా నా జీవితంలో గందరగోళాన్ని సృష్టించింది. నా వద్ద డబ్బులు లేవనీ, కుటుంబాన్ని పోషించాలనీ, వేరేమార్గం లేక ఇలాంటి మార్గం ఎంచుకున్నాననీ.. ఇదంతా నేనే చెప్పినట్లుగా కథనాలు వెలువడ్డాయి. అదృష్టవశాత్తూ.. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు నమ్మలేదు. ఆఖరుసారిగా చెబుతున్నా.. అది నా ప్రకటన కాదు. పునరావాస సదనంలో పత్రికలు, టీవీలు, ఇంటర్‌నెట్‌, రేడియో ఇవేవీ అందుబాటులో లేకుండా పోయాయి.

    ముంబయిలోని ఇంటికి చేరాక అప్పటి వరకూ వచ్చిన కథనాలను చూసి అసంతృప్తికి లోనయ్యాను. ఆగస్టు 30న ఓ అవార్డుల కార్యక్రమం కోసం హైదరాబాద్‌లో ఉన్నాను. కార్యక్రమ నిర్వాహకులే నాకు టికెట్లు, వసతి ఏర్పాటు చేశారు. నా ప్రయాణ సంబంధ వివరాలన్నీ నా ఈమెయిల్‌ బాక్సులో ఉన్నాయి. సెక్సు వ్యాపారం కోసం నన్నెవరూ ప్రోత్సహించలేదు. నా తల్లిదండ్రులు నాక్కావలసినవన్నీ సమకూర్చారు.

    మూడున్నరేళ్లుగా భారతీయ శాస్త్రీయ సంగీతంపై 'రూట్స్‌' పేరిట డాక్యుమెంటరీ తీయడంలో తీరికలేకుండా ఉన్నాను. 'ఐఎన్‌టీ.కేఫెనైట్‌' పేరిట ఓ లఘుచిత్రం చేశాను. అది ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతోందది. మరి తలుపులెక్కడ మూసుకుపోయాయి. ఓ నిర్ణయానికి వచ్చేముందు వాస్తవాలు తెలుసుకోండి.'' అని శ్వేతాబసు తన లేఖలో పేర్కొన్నారు.

    ఇంతకుముందు..

    వ్యభిచారం అంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్ కు పిలవలేదు. అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనటానికి అక్కడకు వెళ్లాను. నా తలరాత అనండి..ఇంకోటి అనండి..వెనక్కి వచ్చే విమానం మిస్సయ్యాను. ఆ అవార్డుల కమిటీ నిర్వాహకులే విమానం టిక్కెట్, బస ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారంలో బలిపశువుని అయ్యాను. ఆ సమయంలో పోలీస్ దాడి జరిగింది. ఈ సంఘటనను తోసి పుచ్చటం లేదు. కానీ బయిటకు చెప్పేవన్నీ నిజాలు కావు అంటూ భాధగా చెప్పారు శ్వేతాబసు.

    అలాగే...ఓ ప్రముఖ మీడియా సంస్ధకు చెందిన జర్నలిస్టుపై శ్వేతబసు నిప్పులు కక్కారు. దాదాపు అరవై రోజులు తర్వాత రెస్కూ హోమ్ నుంచి విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పని విషయాల్ని తమ పత్రికలో ప్రచరించటంపై సీరియస్ అయ్యారు. కేసు పెడతానంటూ మండిపడ్డారు.

    వ్యభిచార ఆరోపణలతో అరెస్టై, కోర్టు ఆదేశాలతో ఇటీవలే రెస్కూ హోమ్ నుంచి బయిటకొచ్చిన కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతాబసు హీరోయిన్ తొలిసారిగా నోరు విప్పింది. ముంబైలోని తన ఇంటినుంచి అక్కడ పత్రిక డిఎన్ ఎ కు ఇంటర్వూ ఇచ్చింది.

    English summary
    Swetha Basu... : I understand that everything was a chain of reaction and versions of the incident with several mis-leading stories were picked up along with my...........wait, NOT MY 'statement!', which said:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X