షూటింగ్ లో శ్వేతాబసు గొడవ
కొత్త బంగారం శ్వేతాబసు తనపై చిత్రీకరించనున్న సెక్సీ సాంగ్ లో నటించనని వాకట్ చేయటం అంతటా సంచలనం సృష్టిస్తోంది.ఈ సంఘటన నిన్న(మంగళవారం)సాయింత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో చోటుచేసుకుంది. శ్వేతాబసు నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో కృష్ణ, శ్రీదేవి నటించిన 'వజ్రాయుధం' చిత్రంలోని ఆ ముగ్గ మీద అనే పాట రీమిక్స్ చేస్తున్నప్పుడు అందునిమిత్తం సెక్సీ ఎక్సప్రెషన్స్ కోరితే శ్వేత కుదరదని చెప్పటం జరిగింది. అయితే దర్శక, నిర్మాతలు ఆ పాట సినిమాకు ప్రత్యక ఎస్సెట్ అవుతుందని పట్టుపట్టడంతో ఆమె వారిని కాదని షూటింగ్ నుంచి బయిటకు వచ్చింది. వజ్రాయుధంలోనే ఆ పాటే చాలా రొమాంటిక్ గా ఆ రోజుల్లో దర్శకుడు రాఘవేంద్రరావు గారు చిత్రీకరించారు. ఇప్పుడు దాన్ని రీమిక్స్ చేస్తూ మరింత సెక్స్ భంగిమలు చేయటం ఆమెకు చిరాకు తెప్పించింది. దాంతో కెమెరామెన్, నృత్య దర్శకుడు,డైరక్టర్ లతో ఆమె గొడవ పడింది.
అయితే దర్శక, నిర్మాతలు మాత్రం శ్వేతాబసు ఊహించినంత వల్గర్ గా సాంగ్ ఉండదని చెప్తున్నారు. ఇక ఈ సంఘటన తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల్లో సంచలనమే అయ్యింది. దర్శక, నిర్మాతలను కాదంటే ఎక్కడ కెరీర్ పోతుందో అని ఎలాంటి సీన్స్ అయినా చేయటానికి సిద్దపడుతున్న హీరోయిన్స్ కి ఈ సంఘటన ధైర్యానిస్తుందంటున్నారు. ఇక ఇంతకుముందు 'రైడ్' చిత్రంలోనూ శ్వేతాబసు పై చిత్రీకరించిన 'దంచవే మేనత్త కూతురా' పాట రీమిక్స్ బాగా వర్కువుట్ అవటంతో ఈ పాటని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే శ్వేతాబసు పై కంప్లైంట్ చేయటానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ చిత్రం షూటింగ్ ఆగింది. దీనిపై ప్రస్తుతం రాజీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











