ఏ భంగిమైనా మహేష్‌కు నిమిషంలో అంటున్న బ్యాడ్‌లేడీ!
బిజినెస్ మేన్ సినిమాలో 'వి లవ్ బ్యాడ్ బ్యాయ్స్' అంటూ బ్యాడ్ లేడీ మాదిరి ఐటం సాంగులో చిందులేసిన శ్వేతా భరద్వాజ్ మహేష్ బాబు గురించి చాలా విషయాలే చెబుతోంది. మహేష్‌బాబుతో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన మంచి డ్యాన్సర్. ఎటువంటి క్లిష్టమైన భంగిమకైనా నిమిషంలో రెడీ అయిపోతాడు అంటోంది. నేను మోడలింగ్ రంగం నుంచి వచ్చాను. మోడలింగ్‌తో పోల్చుకుంటే సినిమా ప్రపంచం వేరు. ఇక్కడ మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. తెలుగులో నా మొదటి చిత్రం ఇందుమతి. 'బిజినెస్‌మేన్' చిత్రం ద్వారా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుంది. తెలుగులో హీరోయిన్స్ రోల్స్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది.
తను నర్తించిన ఐటం సాంగు గురించి మాట్లాడుతూ...ఆ పాటకు తనే పర్‌ఫెక్డ్ ఛాయిస్ అని పూరి జగన్నాథ్ భావించడం వల్లే ఈ పాటలో నర్తించే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. 'సినిమా విడదలయ్యాక నా పెర్‌ఫ్మాన్స్‌ను ప్రశంసిస్తూ అభిమానులు లెక్కలేనన్ని మెయిల్స్ పంపించారు. ఆన్‌లైన్‌లో వేలమంది ఈ పాటని వీక్షించడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. తెలుగు తెరపై పాతుకు పోవడానికి అమ్మడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం వేసి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి శ్వేత కెరీర్ ఎలా ఉండబోతోందో చూడాలి.
మహష్ బాబు ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నారు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకీ సరసన 'జర్నీ'ఫేం అంజలి నటిస్తోంది.


Click it and Unblock the Notifications











