రామ్ చరణ్ 'ఎవడు'లో ఐటం గర్ల్ గా ఆమెనే...

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
'జంజీర్' సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్, 30వ తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ షెడ్యూల్ లో నుంచి సమంతా,రామ్ చరణ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే 'జగదేకవీరుడు-అతిలోక సుందరి'లోని పాపులర్ సాంగ్ 'అబ్బనీ తియ్యనీ దెబ్బ..' పాట ని ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆ తర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.


Click it and Unblock the Notifications











