లావు తగ్గటానికే ఐరోపా వెళ్తున్నా
నటనకు కొంచెం గ్యాప్ ఇచ్చి శరీర బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నా. స్లిమ్‌గా తయారయితే యాక్షన్‌తో కూడిన మంచి పాత్రల్లో నటించవచ్చు . బరువు తగ్గడం కోసం త్వరలో ఐరోపా దేశాలకు బయలుదేరనున్నాను అంటూ శ్వేతా మీనన్ వెల్ల డించింది. రాజన్న,రతి నిర్వేదం,ఏక వీర చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన శ్వేత మీనన్ తనపై పడిన శృంగార తార ముద్రను తొలిగించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
లావెక్కడం వల్ల అందరూ శృంగార పాత్రలనే ఇస్తున్నారని వాపోయింది. రెండేళ్ల క్రితం వరకు హీరోయిన్‌గా నటించిన తనకు ఇలా నటించడం కొంచెం బాధగానే ఉందని అంది. ప్రస్తుతం అన్నీ శృంగార పాత్రల్లో నటించే అవకాశాలే వస్తున్నాయని నటి శ్వేత మీనన్ వాపోయింది. ఇటీవల అరవాన్ చిత్రంలో దాసి పాత్రలో నటించిన ఈమె ప్రస్తుతం మలయాళంలో హౌస్‌ఫుల్, ఇదర మదురం, ఒసిమురి చిత్రాల్లో నటిస్తున్నారట. ఈ మూడు చిత్రాల్లోను ఆ అమ్మడు శృంగారం ఒలికించే పాత్రలే చేస్తోంది. లావు తగ్గి వచ్చాక తన కెరీర్ లో మార్పు వస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











