హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించలేదంటూ...

''నేను ఎటువంటి తప్పు చేయలేదు. నిర్వహణ కమిటీలో భాగమైనందున శ్వేతకు క్షమాపణలు చెప్పాను. ఆమె మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను విచారిస్తున్నాను'' అని కురుప్ సోమవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమానంతరం పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కురుప్‌పై ఫిర్యాదు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే(ఆదివారం రాత్రి) శ్వేతామీనన్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా శ్వేత ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్థానిక కోర్టుకు సమర్పించేశామని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును మూసివేయాలంటే శ్వేత వాంగ్మూలాన్ని మళ్లీ తాజా నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.
ఈ మేరకు కొన్ని ఫొటోలు చూపించారు. ఆమెను వేధించింది వేరేవాళ్లన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన ప్రతిష్ఠతను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 'నాకు 70 ఏళ్లు. మహిళలను చూసి ఉద్రేకం చెందే వయసును ఎప్పుడో దాటిపోయాను' అని కురుప్ తెలిపారు. మరోవైపు.. శ్వేతామీనన్ నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సీఎం ఊమెన్ చాందీ పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











