twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించలేదంటూ...

    By Srikanya
    |

    Swetha Menon
    కొల్లాం: మలయాళ నటి,రతి నిర్వేదం వంటి చిత్రాల హీరోయిన్ శ్వేతామీనన్‌(39)తో తాను అసభ్యంగా ప్రవర్తించలేదని కేరళ కాంగ్రెస్‌ ఎంపీ ఎన్‌ పీతాంబర కురుప్‌(71) పునరుద్ఘాటించారు. బోటు రేసు నిర్వహణ కమిటీలో తానూ భాగమైనందున ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన శ్వేతకు తాను క్షమాపణలు చెప్పానని వివరించారు. తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నందుకు ఆయన శ్వేతకు కృతజ్ఞతలు తెలిపారు.

    ''నేను ఎటువంటి తప్పు చేయలేదు. నిర్వహణ కమిటీలో భాగమైనందున శ్వేతకు క్షమాపణలు చెప్పాను. ఆమె మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను విచారిస్తున్నాను'' అని కురుప్‌ సోమవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమానంతరం పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కురుప్‌పై ఫిర్యాదు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే(ఆదివారం రాత్రి) శ్వేతామీనన్‌ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

    ఇదిలా ఉండగా శ్వేత ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను స్థానిక కోర్టుకు సమర్పించేశామని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును మూసివేయాలంటే శ్వేత వాంగ్మూలాన్ని మళ్లీ తాజా నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు.

    ఈ మేరకు కొన్ని ఫొటోలు చూపించారు. ఆమెను వేధించింది వేరేవాళ్లన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన ప్రతిష్ఠతను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 'నాకు 70 ఏళ్లు. మహిళలను చూసి ఉద్రేకం చెందే వయసును ఎప్పుడో దాటిపోయాను' అని కురుప్ తెలిపారు. మరోవైపు.. శ్వేతామీనన్ నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సీఎం ఊమెన్ చాందీ పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    English summary
    After two days of standing her ground, popular Malayalam film actress Swetha Menon has withdrawn her complaint against Congress MP Peethamabara Kurup for allegedly groping her. In an email to the media late Sunday evening, she said she was not interested in pursuing her complaint and was not going ahead with any legal steps, in the wake of repeated apologies by Kurup, which has been accepted. The email states she took this step after consulting her guru, father, husband and not under any pressure.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X