శ్వేతా ప్రసాద్ నెక్ట్స్ సినిమా

అయితే స్క్రిప్టు మంచిది అయితేనే చేస్తానని ఆమె ఏ సినిమా ఒప్పుకోలేదు. అయితే ఎన్.వి.ప్రసాద్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ,క్యారెక్టర్ నచ్చటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ కొత్త సినిమాను రత్న సెల్యులాయిడ్స్ అనే నూతన నిర్మాణ సంస్ధ ప్రొడ్యూస్ చేస్తోంది. డిస్ట్రిబ్యుషన్ రంగంలో ఎక్సపీరియన్స్ సంపాదించిన కొందరు ప్రెండ్స్ కలసి ప్రారంభించిన ఈ సంస్ధ కీ ఇదే మొదటి సినిమా. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని తెలుస్తోంది.
డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో శ్వేతా సెలక్టు అవటంతో చాలా మందికి ఈ కొత్త సినిమాపై దృష్టి పడింది. అలాగే శ్వేతా ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలు చేస్తోంది. గతంలోను ఆమె మక్కిడి,ఇక్బాల్ వంటి పాపులర్ సినిమాలో యాక్ట్ చేసి నటనకు అవార్డ్ లు సైతం పొందింది.


Click it and Unblock the Notifications











