దమ్ముంటే అమల, సమంతలను పంపు.. నాగార్జునకు శ్వేతా రెడ్డి సవాల్.. బూతు పురాణం!

Recommended Video

Bigg Boss Telugu 3 : Anchor Swetha Reddy Fires On Akkineni Nagarjuna || Filmibeat Telugu

హీరో నాగార్జునపై యాంకర్ శ్వేతా రెడ్డి మరోసారి విరుచుకు పడింది. బిగ్ బాస్ షో నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్వేతా రెడ్డి తన పోరాటాన్ని ఆపడం లేదు. ఈ మేరకు శుక్రవారం (ఈ రోజు) హైదరాబాద్ లో ప్రెస్ మీట్‌లో పాల్గొన్న శ్వేతా రెడ్డి.. నాగార్జునపై బూతుల వర్షం కురిపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్‌పై ఆరోపణలు

ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్‌పై ఆరోపణలు

శ్వేతా రెడ్డి గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ షోపై ఆరోపణలు గుప్పిస్తూ వస్తోంది. పలు డిబేట్స్‌లో పాల్గొంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై విరుచుకు పడుతోంది. తనను బిగ్ బాస్ లోకి తీసుకున్నామని చెప్పి సంతకాలు కూడా అయ్యాక.. బాస్‌ని తృప్తి పరచాలంటే మీరు ఏం చేస్తారు? ఎలా తృప్తి పరుస్తారు? అని అడిగారని శ్వేతా రెడ్డి చెప్పింది. ఈ మేరకు బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారా? అని ప్రశ్నించింది శ్వేతా రెడ్డి.

శ్వేతా రెడ్డికి పలువురి మద్దతు.. నాగార్జున ఇంటి ముట్టడి

శ్వేతా రెడ్డికి పలువురి మద్దతు.. నాగార్జున ఇంటి ముట్టడి

బిగ్ బాస్‌పై శ్వేతా రెడ్డి చేసిన ఆరోపణలకు గాయత్రీ గుప్తా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లాంటి వారు ఓయూ జేఏసీ మద్దతు తెలిపింది. బిగ్ బాస్ వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు కేసులు, నాగార్జున ఇంటి ముట్టడి లాంటి ఎన్నో చర్యలు జరిగాయి. కానీ నాగార్జున ఇంతవరకు స్పందించలేదు. పైగా షో సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభమైంది.

శ్వేతా రెడ్డి దూకుడు

శ్వేతా రెడ్డి దూకుడు

ఈ నేపథ్యంలో శ్వేతా రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ మరిన్ని సంచలన ఆరోపణలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాటాడిన ఆమె నాగార్జునపై బూతు పురాణం మొదలుపెట్టింది. ఇంతలా మొత్తుకున్నా నాగార్జున ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. నాగార్జునకు సామాజిక బాధ్యత ఏ మాత్రం లేదని మండిపడింది.

నాగార్జున, అమల పరిస్థితి ఇది

నాగార్జున, అమల పరిస్థితి ఇది

నాగార్జున, ఆయన భార్య అమల జంతువుల సంరక్షణపై అంతలా శ్రద్ద తీసుకుంటున్నారు కానీ బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు గొంతు చించుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయింది. 'మన్మథుడు2' ప్రమోషన్స్ పై ఉన్న ద్యాస తనపై వస్తున్న ఆరోపణలపై నాగార్జునకు లేకపోవడం సిగ్గుచేటని పేర్కొంది శ్వేతా రెడ్డి.

దమ్ముంటే అమల, సమంతలను పంపు

దమ్ముంటే అమల, సమంతలను పంపు

బాస్ హౌస్‌లో టాస్క్ లు అంటూ హింసలకు గురి చేస్తున్నారని, దమ్ముంటే నీ భార్య అమల, నీ కోడలు సమంతలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపు అని సవాల్ విసిరింది శ్వేతా రెడ్డి. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారంటూ రెచ్చగొట్టింది శ్వేతా రెడ్డి. అంతేకాదు నాగార్జునపై బూతు పురాణం మొదలెట్టింది.

ఇప్పటికైనా కొలిక్కి వచ్చేనా..?

ఇప్పటికైనా కొలిక్కి వచ్చేనా..?

బిగ్ బాస్ పై ఆరోపణలు ఆగేలా లేవు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేటి అయిన హేమ కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్వేతా రెడ్డి, శ్రీ రెడ్డి, గాయత్రీ గుప్తా సంచలన వ్యాఖ్యలు ఆగటం లేదు. ఈ పరిస్థితుల నడుమ నాగార్జున నోరు విప్పుతారా? బిగ్ బాస్ సమస్య కొలిక్కి వస్తుందా ? చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X