Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ వివాదం: గీతా మాధురిపై సెన్సేషనల్ కామెంట్స్, ముందే కుమ్మక్కయ్యారా?
Recommended Video
బిగ్ బాస్ వివాదానికి సంబంధించి శ్వేతారెడ్డి... మాటీవీకి సంబంధించిన కోఆర్డినేటర్లు రవికాంత్, రఘు, శ్యాం మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవికాంత్‌కు మద్దతుగా గీతా మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ''రవికాంత్ గారు నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. 2004లో నేను స్కూల్ డ్రెస్ వేసుకుని లిటిల్ మ్యూజీషియన్ అకాడమీకి వెళ్లినప్పటి నుంచి పరిచయం. చాలా డీసెంట్ పర్సన్. ఆయనకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.' అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో చూసిన శ్వేతారెడ్డి తనదైన శైలిలో గీతా మాధురికి కౌంటర్ ఇచ్చారు.
దిక్కులేక కౌశల్‌ను విన్నర్‌గా ప్రకటించారు
గీతా మాధురి అనే వ్యక్తి బిగ్ బాస్ 2 కంటెస్టెంటుగా వెళ్లినపుడు అమ్మా నువ్వే బిగ్ బాస్ 2 విన్నర్ అని చెప్పి ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని నా నోటీసుకు వచ్చింది. కానీ అనుకోకుండా కౌశల్ ఆర్మీ వేగంగా దూసుకుపోవడం, బయటి నుంచి బాగా సోషల్ ప్రమోషన్ చేయడంతో.. వేరే దిక్కులేక కౌశల్‌ను విన్నర్‌గా అనౌన్స్ చేశారని నాకు తెలిసింది... అని శ్వేతారెడ్డి వ్యాఖ్యానించారు.
దీప్తిని తుంగలో తొక్కారు..
రెండో సీజన్లో సెకండ్ ప్లేసులో జర్నలిస్ట్ దీప్తి ఉండాల్సి ఉంది. కానీ ఆమెను కూడా పక్కకు నెట్టి, పబ్లిక్ నుంచి వచ్చిన నిజమైన ఓట్లను కూడా తుంగలో తొక్కించి గీతా మాధురిని రన్నరప్‌గా చేశారు. మీకు ముందే బిగ్‌బాస్ 2 విన్నర్ మీరే అని కన్ఫర్మ్ చేసి.. నిజాయితీగా గేమ్ ఆడనివ్వకుండా, నిజాయితీగా ఓట్లతో మిమ్మల్ని గెలవనీయకుండా.. ఇలా అడ్డదారి తొక్కిస్తూ మీకు సపోర్ట్ చేసిన రవికాంత్ గారంటే మీకు కచ్చితంగా గౌరవం ఉంటుంది. ఎందుకంటే మీకు అన్నీ అనుకూలంగా చేశారు కాబట్టి.... అని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.
మీలాంటి సెలబ్రిటీలకు అంతే...
మీలాంటి సెలబ్రిటీలకు అనుకూలంగా సెలక్షన్స్ జరుగుతాయి. అనుకూలంగా ప్యాకేజీలు ఇస్తారు, అనుకూలంగా ముందే జడ్జిమెంట్లు ఇస్తారు. మీకు రవికాంత్ చిన్నప్పటి నుంచి పరిచయం ఉందేమో.. మా టీవీ అనే సంస్థకు నేను పని చేశాను. నా కజిన్స్ కూడా మా టీవీలో, బిగ్ బాస్ షో కోసం పని చేస్తున్నారు. రవి కాంత్ గారు దుబాయ్, లండన్, యూఎస్ ఈవెంట్స్ చేసేపుడు మీ లాంటి బ్యూటిఫుల్ సింగర్లకు ప్యాకేజీలు ఎక్కువగా ఇచ్చి పాడిస్తుంటారు. అలాంటి వ్యక్తిపై మీకు గౌరవం ఉండటంతో ఆశ్చర్యం ఏమీ లేదు.... అని శ్వేతా రెడ్డి మండి పడ్డారు.
రవికాంత్ బ్యాడ్ అని నేను ఎప్పుడూ చెప్పలేదు, దొంగలా తప్పించుకోవడం తప్పని చెప్పా
రవికాంత్ గారు మంచి వ్యక్తి అని మీరు అంటున్నారు. కానీ నేను ఎక్కడా ఆయన చెడ్డవ్యక్తి అని చెప్పలేదు. సెలక్షన్ ప్రాసెస్‌లో ఆయన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంది. అగ్రిమెంట్ జరిగిన తర్వాత మాకు తెలియదు అని ఎవరికి వారు దొంగలా తప్పించుకోవడం తప్పని చెప్పాను. అబ్యూసివ్ కన్వర్జేషన్ చేసింది మిస్టర్ శ్యాం, ఆసమయంలో పక్కన ఉన్నది రఘు అని చెప్పాను. రవికాంత్ బ్యాడ్ అని ఎప్పుడూ చెప్పలేదు.... అని శ్వేతారెడ్డి తెలిపారు.