అనసూయపై ట్రోలింగ్.. మధ్యలోకి సమంతను లాగిన శ్వేతారెడ్డి.. నెటిజన్లపై ఫైర్
అనసూయపై అసభ్యకర పదాలను వాడటం, సోషల్ మీడియాలో ఇష్టారీతిగా కామెంట్లు పెట్డడం, వాటిపై అనసూయ ఫిర్యాదు కూడా చేయడం ఈ వారంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. వీటిపై ఫైర్ బ్రాండ్ జర్నలిస్ట్, బీజేపీ నాయకురాలు శ్వేతారెడ్డి ఫైర్ అయింది. వల్గర్ కామెంట్స్ పెట్టే నెటిజన్ల దుమ్ముదులిపింది. ఓ సారి ఆ కథేంటో చూద్దాం.

అనసూయపై బ్యాడ్ కామెంట్స్..
ఇటీవలె ట్విట్టర్‌లో అనసూయను అసభ్య పదజాలంతో దూషించారు కొందరు ఆకతాయిలు. దీంతో వాటిపై ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదు చేయగా.. దాంట్లో తప్పేముందని వారు సమాధానమిచ్చారు. ఇక లాభం లేదని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ విషయంపై భిన్న రకాల వాదనలు వినిపించాయి.

అలా చేస్తేనే భయపడతారు..
అనసూయ ఇలా చేయడంతో వారికి హైప్ ఇచ్చినట్టు అవుతుందని, అప్పటి వరకు పది మందికి తెలిసిన విషయం వంద మందికి తెలుస్తుందని ఇలాంటివి పట్టించుకోవద్దని కొందరు సలహా ఇవ్వసాగారు. అయితే అలా ఊరుకోబట్టే ఇంత వరకు వచ్చిందని, ఫిర్యాదు చేసి వారికి శిక్ష పడేలా చేస్తేనే వారు భయపడతారని అనసూయ చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌పైనే ఆరోపణలు..
జర్నలిస్ట్ శ్వేతారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమే. బిగ్‌బాస్ మూడో సీజన్ ప్రారంభానికి ముందే అంతటి సంచలనం సృష్టించడానికి ఓ రకంగా శ్వేతారెడ్డినే కారణం. బిగ్‌బాస్ నిర్వాహకులపై ఆరోపణలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడారంటూ మీటూ ఆరోపణలు చేయడం అప్పట్లో వైరల్ అయ్యాయి. బీజేపీలో చేరిన శ్వేతారెడ్డి ప్రస్తుతం అనసూయకు సంబంధించిన వ్యవహారంపై మండిపడింది.
Recommended Video


సమంతను అనగలరా..?
అనసూయ ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి.. ఎంతో మంది వేసుకుంటున్నారు.. సినిమాల్లో ఎన్నో చేస్తున్నారు.. సమంత కూడా వేసుకుంటుంది.. ఆమెను ట్రోల్ చేయగలరా? అంటూ బ్యాడ్ కామెంట్స్ చేసే నెటిజన్లపై ఫైర్ అయింది. మీకు నచ్చిన వారైతే ఒకలా.. నచ్చకపోతే ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తారా? అంటూ దుమ్ముదులిపింది.


Click it and Unblock the Notifications











