రామ్ గోపాల్ వర్మపై శ్వేతా రెడ్డి షాకింగ్ కామెంట్స్.. అందుకే ప్రభాస్‌ని లాగేశాడంటూ!

Recommended Video

Swetha Reddy Sensational Comments On RGV || Filmibeat Telugu

యాంకర్ శ్వేతా రెడ్డి.. మొన్నటిదాకా పెద్దగా ఎవ్వరికీ తెలియని ఈమె ఇటీవలే బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. దీంతో రెండు రాష్ట్రాల్లోని జనానికి సుపరిచితం అయింది. గతంలో బిగ్ బాస్‌ షోపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ షో నిలిపివేయాలని డిమాండ్ చేసిన శ్వేతారెడ్డి తాజాగా రామ్ గోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసి మరో సంచలనం సృష్టించింది. ఇంతకీ వర్మను కామెంట్ చేయాల్సిన అవసరం ఆమెకు ఎందుకొచ్చింది? అసలు సంగతి ఏంటి? పూర్తి వివరాల్లోకి పోతే..

సరికొత్త సంచలనాలకు తెరలేపిన వర్మ

సరికొత్త సంచలనాలకు తెరలేపిన వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. ఊహించని విధంగా గత కొన్ని రోజులుగా టైమ్ క్యాచ్ చేస్తూ ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు వర్మ.

కాంట్రవర్సీ లేదంటూనే.. కాంట్రవర్సీ

ఈ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి కాంట్రవర్సీ లేదంటూనే ఈ సాంగ్ ద్వారా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడనేది కొందరి వాదన. దీంతో ఈ సాంగ్ పై ఎవ్వరికి స్టైల్‌లో వారు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా దీనిపై శ్వేతా రెడ్డి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆర్జీవీ చెప్పిన వర్షన్ ఆయనది కాదు

ఆర్జీవీ చెప్పిన వర్షన్ ఆయనది కాదు

ఇప్పటిదాకా వర్మ రిలీజ్ చేసిన రక్తచరిత్ర, వంగవీటి సినిమా పాటల్లోకెల్లా ఈ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ పాట ద్వారా ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎంత కాలుతుందనేది నాకు అర్థమైంది. నా కుటుంబం, నా ఇల్లు, నా వాళ్ళు అన్నప్పుడు నా క్యాస్ట్ అని ఎందుకు చెప్పకూడదు అని పాటలో ఆర్జీవీ చెప్పిన వర్షన్ ఆయనది కాదని నా అభిప్రాయం అని పేర్కొంది శ్వేతా రెడ్డి.

మంచి ట్రిక్ ప్లే చేశారు

మంచి ట్రిక్ ప్లే చేశారు

కులం అంటే ఎవరైతే ఊగి పోతారో అలాంటి వారందరి ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఆర్జీవీ ఈ ట్రిక్ ప్లే చేశాడనేది తన ఫీలింగ్ అంటూ షాకిచ్చింది శ్వేతా. ఈ వీడియో మొత్తం చూశాక, ఆయన పళ్ళు కొరుకుతూ చెప్పే విధానం చూస్తుంటే నాకు అర్థమైంది ఒక్కటే.. కులం గురించి ఆర్జీవీ ఒరిజినల్ ఒపీనియన్ ఇది కాదు అని. ఇదంతా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ప్రమోషన్ కోసం ఇదో ట్రిక్ అని శ్వేతా చెప్పుకొచ్చింది.

అందుకే ప్రభాస్‌ని లాగేశాడు

అందుకే ప్రభాస్‌ని లాగేశాడు

ప్రభాస్ సినిమా సాహో వస్తోంది కాబట్టి ఈ కమ్మ రాజ్యంలో రెడ్ల హవాకి ప్రభాస్ ని కూడా లాగినట్లుగా తనకు అనిపిస్తోందని చెపింది శ్వేతారెడ్డి. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆర్జీవీ ఇలా ప్రభాస్ హెల్ప్ కూడా తీసుకున్నారని, సాహోతో పాటు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను కూడా హిట్ చేసేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తన అభిప్రాయమని చెప్పింది. ఇక చివరగా ఆర్జీవీ అంటే క్రియేటివిటీ కింగ్ అని తెలిపింది శ్వేతా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X