For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటి హేమపై శ్వేతా రెడ్డి ఫైర్: బిగ్ బాస్ గబ్బు గురించి పోరాటం చేస్తుంటే...

  |

  బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా గాయిత్రి గుప్తా, శ్వేతా రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని సినీ నటి హేమ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఎవరైతే మిమ్మల్ని ఏదో అన్నారని ఆరోపణలు చేస్తున్నారో.... మీరు వారిని ఆ మాట అన్నరోజే మీడియా ముందుకు వచ్చి కేసులు పెట్టాల్సింది. సెలక్ట్ చేయలేదని తెలిసిన తర్వాత ఇలా చేయడం ఎంత కరెక్ట్? అంటూ హేమ వ్యాఖ్యానించారు.

  హేమ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ శ్వేతారెడ్డి స్పందించారు. హేమ తీరును తప్పుబట్టారు. మమ్మల్ని సెలక్ట్ చేయమని మేము అడిగామా? మొదటి నుంచి నేను ఒకటే విషయం అడుగుతున్నాను. వారు అగ్రిమెంట్ పేపర్లమీద సంతకం పెట్టుకున్న తర్వాత క్యాండిడేట్లకు జిరాక్స్ కాపీలు ఇవ్వాలి. ఇవ్వుకంటే చీటింగ్ కేసు కింద నమోదవుతుందనే విషయం మీకు తెలియకుంటే తెలుసుకోండి... అని శ్వేతారెడ్డి ఫైర్ అయ్యారు.

   నాగార్జున గారితో రికమండేషన్లు పెట్టించుకున్నారో? ఏమో?

  నాగార్జున గారితో రికమండేషన్లు పెట్టించుకున్నారో? ఏమో?

  రెంట్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని మీరు ఇటీవల చెప్పారు. మీకు సినిమా ఆఫర్లు తక్కువ అయ్యాయి కాబట్టి మీరు నాగార్జున గారితో రికమండేషన్లు పెట్టించుకున్నారో? ఏమో?... మీకు అవకాశాలు లేవు కాబట్టి బిగ్ బాస్ మీ లాంటి వారికి అవసరం. మాకెందుకండీ? నేను ఒక జర్నలిస్టును, బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయాలనే ఆశ నాకు లేదు. హేమ గారు మాట్లాడేపుడు జాగ్రత్తగా మాట్లాడండి.... అంటూ శ్వేతా రెడ్డి హెచ్చరించారు.

  మీ భాగోతం అందరికీ తెలుసు

  మీ భాగోతం అందరికీ తెలుసు

  తెలుగు కూడా సక్రమంగా చదవలేని ఒక పొజిషన్లో మీ లాంటి వారు ఉన్నారు. మీ తీరు చూసి అందరూ నవ్వుకున్నారు. ‘మా'లో మీరు ఎలా చండాలంగా, నీచంగా ఒకరికొకరు స్టేజీమీద కొట్టుకన్నారో, మైకుల కోసం కక్కుర్తి పడ్డారో ప్రజలంతా చూశారు. మేము అలా కాదండీ... బిగ్ బాస్ సెలక్షన్లో వారు ఎంత నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించారో మేము వేసిన కేసుల ద్వారా బయటకు వస్తుంది... అని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.

  అలా అనడం సరైంది కాదు

  అలా అనడం సరైంది కాదు

  100 రోజులు నువ్వు సెక్స్ లేకుండా ఎలా మేనేజ్ చేయగలవు అనే ప్రశ్నను కూడా కొందరు మేధావులు సపోర్ట్ చేస్తున్నారు. అవునండీ, ఇదంతా కండీషన్లో భాగమేనండీ, దాన్ని శిరసా వహించాలండీ అంటున్నారు. ఇది సరైంది కాదని... శ్వేతారెడ్డి తెలిపారు.

  మీకు అలాంటివి అలవాటేమో?

  మీకు అలాంటివి అలవాటేమో?

  హేమగారూ.. మీ లాంటి వారికి ఈ కండీషన్లు, క్లాజులు, మీ సినిమా అగ్రిమెంటులో భాగంగా ఒప్పుకోవడం అలవాటేమో? ‘మీరు ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ చూపించాలి, మా బాస్‌ను సాటిస్పై చేయాలి.. మీకు ముద్దులకు ఓకేనా? కిస్సులకు ఓకేనా? లేకపోతే హగ్గులకు ఓకేనా? సెక్సువల్ ఫేవర్ ఇవ్వడానికి హామీలు ఇస్తారా? బాస్‌తో సినిమా షూటింగ్ తర్వాత సెక్స్ చేస్తారా?'' ఇలాంటి వాటికి సంబంధించి మీకు బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టడం అలవాటేమో? మా జర్నలిస్టులు అలా కాదండీ, తేడాలొస్తే తాట తీస్తాం... అంటూ శ్వేతారెడ్డి హెచ్చరించారు.

  మీపై నిందలు వేస్తారా?

  మీపై నిందలు వేస్తారా?


  మీ లాంటి మహిళలు ఒక మహిళా జర్నలిస్టు బయటకు వచ్చి బాబూ బిగ్ బాస్ రియాల్టీ షోలో జరుగుతున్న గబ్బు గురించి బయట పెట్టండి, మహిళలను రక్షించండి అని బాధ్యత తీసుకుంటే... ఉల్టా మీరు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టారని మాపై నిందలు వేస్తారా?... అంటూ శ్వేతారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.

  నాగార్జున గురించి మాకు తెలుసు

  నాగార్జున గురించి మాకు తెలుసు

  నాగార్జున గురించి, నాగార్జున గారి కుటుంబం గురించి ఆయన్ను అభిమానించే వ్యక్తిగా మీకన్నా బాగా తెలుసు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి మహత్యం లాంటి గొప్ప సినిమాలు చేసిన మీ లాంటి వ్యక్తులు ఇలాంటి అసభ్యకరమైన, సెక్స్ రిలేటెడ్ కన్వర్జేషన్లు చేస్తున్న కో ఆర్డినేటర్లు ద్వారా రన్ అయ్యే బిగ్ బాస్ షోను చేయడం కరెక్ట్ కాదు నాగార్జున గారు అని నేను చాలా వినమ్రంగా నివేదించుకున్నాను. అంతే తప్ప ఆయన్ను ఏమీ అనలేదని... శ్వేతారెడ్డి తెలిపారు.

  English summary
  Swetha Reddy Strong Counter To Hema's Comments about Bigg Boss case. Swetha Reddy has alleged that actress Hema lacks social awareness and further alleged that she and other such persons confine themselves in the debate only.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X