ప్రేమ కథల దర్సక,నిర్మాత పేరుతో ప్రత్యేక ట్రైన్
ప్రేమ కథలను తనదైన శైలిలో తెరకెక్కించటంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత యశ్ చోప్రాకు స్విట్జర్లాండ్‌లో చాలా అరుదైన గౌరవం దక్కింది. స్విస్ అందచందాలను, ప్రకృతి రమణీయతను తన చిత్రాల ద్వారా చూపిస్తూ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటున్నందుకు ఆనందంతో స్విట్జర్లాండ్‌లోని ఇంటర్‌లాకున్ పట్టణ పాలక సంస్థ 78 ఏళ్ల యశ్ పేరు కలకాలం గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంది. ముందుగా ఆయనను తమ సాంస్కృతిక రాయబారిగా గౌరవించిన ఇంటర్‌లాకున్.. గత వారం ఆయన పేరుతో ఓ రైలును ప్రారంభించింది. ఈ నెల 8న విక్టోరియా జంగ్‌ఫ్రౌ గ్రాండ్ హొట్‌ల్ అండ్ స్పాలో ఇంటర్‌లాకున్ మేయర్ ఉర్స్ గ్రాఫ్ ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో యశ్ చోప్రాకు రజత ఫలకం అందజేసి గౌరవించారు. ఫాస్లే, విజయ్, చాందీ, దిల్‌వాలే దుల్హనియాలే జాయేంగే వంటి ఎన్నో చిత్రాలు స్విస్‌లో తీసిన యశ్, తనకు లభించిన గౌరవంతో చలించిపోయి ఉద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











