For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్తి యుద్ధంలో ప్రభాస్, రాణాలకు ట్రై‌నింగ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ 'బహుబలి'. ప్రస్తుత రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇది చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది.

    ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాణా కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ సోదరుడిగా నెగెటివ్ రోల్‌లో రాణా కనిపించబోతున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజే ఈ ట్రైనింగ్ మొదలైంది. ఈ విషయాలను తాజాగా రాజమౌళి వెల్లడించారు.

    ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

    ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

    English summary
    "First day of sword fight training 4 Prabhas and Rana.with their height and jumps they looked like giants rather than humans.:) Even anushka at "5.10’’ looked their equal. Nice session. only problem is for the DOP to compose them in the frame..:)" SS Rajamouli told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X