Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారీగా సైరా ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫ్యాన్సీ రేటుతో చేజిక్కించుకున్న కెజీఎఫ్ డిస్ట్రిబ్యూటర్
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. చిరంజీవి 151 వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో భారీ హంగులు జోడించి నిర్మిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలిసింది.
చారిత్రాక కథాంశం, 1920 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మంచి బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సైరా నరసింహా రెడ్డి హిందీ డిజిటర్ రైట్స్‌ను ఎక్సెల్ సంస్థ భారీగా చెల్లించి తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఎక్సెల్ సంస్థ ఈ మధ్యే రిలీజైన కేజీఎఫ్ సినిమాను హిందీలో రిలీజ్ చేసి భారీ లాభాలు గడించింది.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా.. ఆయన భార్య సిద్దమ్మ పాత్రను నయన్ పోషిస్తోంది. ఇక తమన్నా, అనుష్క అందాలు ఈ సినిమాకు మరింత ప్లస్ కానున్నాయి. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం చిత్రానికి భారీ హైప్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ విజయవంతంగా షూటింగ్ పూర్తిచేస్తుండటం విశేషం. వివిధ భాషల్లో ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.