ఆస్కార్ విన్నింగ్ డైరక్టర్ సిడ్నీ ఫోలిక్ సోమవారం రాత్రి కాన్సర్ తో పోరాడుతూ లాస్ యాంజిల్స్ లోని తన సొంత ఇంటిలో మరణించారు. దర్శక నిర్మాతగా 'అవుట్ ఆఫ్ ఆఫ్రికా' (1985) చిత్రానికి గానూ ఆయన రెండు ఆస్కార్స్ గెలుచుకుని తన సినీ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. అలాగే పలు చిత్రాలకు గాను ఆరు సార్లు ఆస్కార్ కి నామినేట్ అయ్యారు. డబ్బై మూడేళ్ళ వయసున్న ఈయన హాలీవుడ్ కి దర్శక నిర్మాతగానే కాక యాక్టింగ్ టీచర్ గానూ, నటుడుగాను సుపరిచితుడు. గత సంవత్సరం ఆస్కార్ నామినేటెడ్ చిత్రం Michael Clayton లో ఆయన నటించారు. ఇక ఆయన సినిమా కెరీర్ లో గొప్పగా ప్రపంచంతో కొనియాడతగినివి The Way We Were, Tootsie, They Shoot Horses, Don't They?, Random Hearts, Out of Africa, Havana, Jeremiah Johnson తదితర చిత్రాలు. ఈ సినీ మేథావి మరణానికి దట్స్ తెలుగు హృదయపూర్వకంగా సంతాపం తెలుపుతోంది.