కోడలు ఉపాసన ద్వారా... ‘సైరా’ రూమర్లకు చెక్ పెట్టిన చిరంజీవి

Recommended Video

Chiranjeevi Trashes Rumors On Syeraa Narasimha Reddy Release Date || Filmibeat Telugu

'సైరా నరసింహారెడ్డి' మూవీ కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు రామ్ చరణ్ గతంలోనే ప్రకటించడంతో అంచనాలు భారీగా పెంచుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని, రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు రావడం, ఈ విషయంలో చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేక పోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. తాజాగా ఈ దీన్ని తొలగించే ప్రయత్నం చేశారు మెగాస్టార్.

కోడలు ఉపాసన ద్వారా... ‘సైరా' రూమర్లకు చెక్ పెట్టిన చిరంజీవి

కోడలు ఉపాసన ద్వారా... ‘సైరా' రూమర్లకు చెక్ పెట్టిన చిరంజీవి

తన కోడలు ఉపాసన రన్ చేస్తున్న బి పాజిటివ్ మేగజైన్ కోసం స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొన్న చిరంజీవి... అనంతరం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విషయాలతో పాటు ‘సైరా' మూవీకి సంబంధించిన విశేషాలు ఆయన నుంచి ఉపాసన రాబట్టారు. ఈ సందర్భంగా సైరా రిలీజ్ విషయంలో వచ్చిన రూమర్లపై చిరంజీవి స్పందించారు.

ఆ రోజే సినిమా వస్తోందని స్పష్టం చేసిన మెగాస్టార్

ఆ రోజే సినిమా వస్తోందని స్పష్టం చేసిన మెగాస్టార్

‘సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోందని, మన జాతి పిత, మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ చిత్రం విడుదల చేయడం ఆనంది, ఇది ఆయన నివాలిలా ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సైరా నరసింహారెడ్డి' శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు 150 సినిమాలు చేశారు. ‘సైరా' ఆయన చేస్తున్న 151వ మూవీ. ఇప్పటి వరకు చిరంజీవి చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ, స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే నిజ జీవిత కథతో ఆయన చేస్తున్న తొలి చిత్రం. బడ్జెట్ పరంగా కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. అందుకే స్వయంగా రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘సైరా'ను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X