సైరా సెన్సార్ రిపోర్టు క్లీన్.. కళ్లు చెదిరే హిట్ ఖాయం.. మూవీ లెంగ్త్ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రం విడుదలకు ముందే సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల్లోను, అలాగే ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు పెంచింది. తాజాగా సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ జరుపుకొన్న ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా సెన్సార్ రిపోర్టు ఏమిటంటే..

యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్
సైరా మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు సెప్టెంబర్ 23న పూర్తయ్యాయి. ఈ సినిమాపై పూర్తిస్థాయిలో సంతృప్తిని అధికారులు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. దాంతో ఈ సినిమా రిలీజ్ లైన్ క్లియర్ అయింది.

సింగిల్ కట్ లేకుండా
సైరా మూవీ వీక్షించిన అధికారులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించినట్టు తెలిసింది. క్లీన్‌గా ఉండటంతో ఒక్క కట్ లేకుండా సినిమాకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమా నిడివి 2.44 నిమిషాలు అని సెన్సార్ రిపోర్టు పేర్కొన్నది. సెన్సార్ అధికారుల నుంచి సానుకూలమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగినట్టు తెలిసింది.

బిగ్ హిట్ అనే టాక్‌తో
సైరాకు పాజిటివ్ ఉండటంతో రిలీజ్‌కు ముందే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొన్నది. ఇక రిలీజ్ తర్వాత భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే సినిమా భారీ హిట్ అనే అంచనాకు కూడా వచ్చేస్తున్నారు.

రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు. ఈ చిత్రం రూ.300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే. జార్జియాలో జరిగిన షూటింగ్‌కే రూ.75 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.

సైరాలో నటించేది వీరే..
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











