twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక.. ఓవర్సీస్ క్రిటిక్స్ రేటింగ్ చూస్తే షాకే

    |

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రంపై పాజిటివ్ టాక్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో రిలీజ్‌కు ముందే రివ్యూలు బయటకు వస్తున్నాయి. కొన్ని సెన్సార్ బోర్డు ప్రివ్యూలతో, మరికొన్ని దుబాయ్ లాంటి సెన్సార్ రిపోర్టు ఆధారంగా క్రిటిక్స్ తమ వన్ వర్డ్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సైరా రివ్యూలు ఎలా ఉన్నాయంటే..

     క్రిటిక్ శివ సత్యం రివ్యూ

    క్రిటిక్ శివ సత్యం రివ్యూ

    క్రిటిక్ శివ సత్యం ఈ మధ్యకాలంలో తన రివ్యూలను ముందే సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. వన్ వర్డ్ రివ్యూ పేరిట.. అవుట్ స్టాండింగ్ అంటూ సమీక్షించాడు. పూర్తిస్థాయి దేశభక్తి, కుటుంబపరమైన వినోదాత్మక చిత్రం. చిరంజీవి టెర్రిఫిక్ ఫెర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది అంటూ తన రివ్యూలో పేర్కొన్నారు.

     డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్

    డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్

    ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. కథ, కథనాలు చక్కగా పండాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సినిమాకు నా రివ్యూ పాయింట్స్ 4/5 అంటూ ట్వీట్ చేశారు. ఇది తప్పకుండా చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు.

    చిరంజీవి ఫెర్ఫార్మెన్స్

    చిరంజీవి ఫెర్ఫార్మెన్స్

    మెగాస్టార్ చిరంజీవి ఫెర్ఫార్మెన్స్‌కు (4.5/5), ఇక సైరా సాంకేతిక విషయానికి వస్తే.. వీఫెక్స్ (4/5) అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ (4/5), డైరెక్షన్‌కు (4/5), సపోర్టింగ్ యాక్టర్స్ (4/5), ఎడిటింగ్ (3.5/5), స్క్రీన్ ప్లే (4.5/5), సినిమాటోగ్రఫి (4/5), బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (3.5/5), స్టోరి (4/5) అని రేటింగ్స్ ఇచ్చారు.

    ఉమేర్ సంధూ రివ్యూ

    ఉమేర్ సంధూ రివ్యూ

    ఇక దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ రెండు రోజుల ముందే ట్వీట్ చేశారు. సైరా సినిమాటిక్ అణిముత్యం. ఎవరైనా చూడకుండా ఉంటే ఏదో కోల్పోయినట్టే.. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, డైలాగ్స్, సౌండ్ ట్రాక్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అని రేటింగ్ ఇచ్చారు.

    English summary
    Paruchuri Gopalakrishna Revealed Fact for Not Attending Sye Raa Pre Release Event. Because If Illness He Didnot Attend This event. His Brother Paruchuri Venkateshwara Rao Wants To Get Oscar Award. Movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X