‘సైరా’ మూవీ యూనిట్‌కు షాక్.. విదేశీ నటుడి మృతి

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వడ దెబ్బకారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా 'సైరా' చిత్రంలో నటించడానికి వచ్చిన ఓ విదేశీయుడు సైతం వడదెబ్బ కారణంగా మరణించడం చర్చనీయాంశం అయింది.

రష్యా పౌరుడైన అలెగ్జాండర్ అనే 38 ఏళ్ల వ్యక్తి రెండు నెలల క్రితం ఇండియా వచ్చారు. 'సైరా' చిత్రంలో బ్రిటిషర్ల పాత్రల కోసం భారీ ఎత్తున ఆడిషన్స్ జరుగడంతో ఆరు నెలల టూరిస్ట్ వీసా మీద ఇండియా వచ్చి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నాడు. గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

గచ్చిబౌళిలోని డిఎల్ఎఫ్ గేట్ 1 వద్ద అలెగ్జాండర్ మంగళవారం అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటంతో... పోలీసులు అతడిని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

గోవాలోని స్నేహితుడికి సమాచారం అందించిన పోలీసులు

గోవాలోని స్నేహితుడికి సమాచారం అందించిన పోలీసులు

అతడి వద్ద ఉన్న వస్తువులు పరిశీలించిన పోలీసులు సైరా నరిసింహారెడ్డి సినిమాలో సైడ్ యాక్టర్‌గా నటించడానికి వచ్చినట్లు గుర్తించారు. అలెగ్జాండర్ స్నేహితుడు బోరెజ్ గోవాలో నివసిస్తున్నట్లు తెలుసుకుని సమాచారం అందించారు. బోరెజ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి భౌతిక కాయాన్ని అతడికి అప్పగించనున్నారు.

బ్రిటిషర్ల పాత్ర కోసం

బ్రిటిషర్ల పాత్ర కోసం

‘సైరా నరసింహారెడ్డి' చిత్రం బ్రిటిష్ పాలనా కాలం నాటి బ్యాక్‌డ్రాపుతో రూపొందిస్తున్నారు. ఈనేపథ్యంలో వందల సంఖ్యలో విదేశీయులను కాస్టింగ్ చేశారు. హైదరాబాద్‌లో చిత్రీకరించిన పలు సన్నివేశాల్లో అలెగ్జాండ్ నటించినట్లు తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది.

ప్యాన్ ఇండియా మూవీ

ప్యాన్ ఇండియా మూవీ

‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X