twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "సైరా" మొదలయ్యేది యాక్షన్ ఏపిసోడ్స్ తోనే: సిద్దమైన మెగాస్టార్

    చిరంజీవి కొత్త సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ఎప్పుడు? ఈ సినిమాఎప్పుడు క్లాప్ కొట్టుకోనుంది? చిరు అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్న సంగ‌తులివి.

    |

    Recommended Video

    బాహుబలి తర్వాత 'సైరా' నే..

    చిరంజీవి కొత్త సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ఎప్పుడు? ఈ సినిమాఎప్పుడు క్లాప్ కొట్టుకోనుంది? చిరు అభిమానులు ఆస‌క్తిగా చ‌ర్చించుకొంటున్న సంగ‌తులివి. ఈ విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. డిసెంబ‌రు 6 నుంచి 'సైరా' రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. క‌ళా ద‌ర్శ‌కుడు రాజీవ‌న్ నేతృత్వంలో హైద‌రాబాద్ అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. ఆ సెట్ ప‌నులు పూర్తి కావొచ్చాయి.

     డిసెంబరు 6వ తేదీనుంచి

    డిసెంబరు 6వ తేదీనుంచి

    మ‌రోవైపు కెమెరామెన్ ర‌త్న‌వేలు కూడా డిసెంబ‌రు మొద‌టి వారంలో ఖాళీ అవుతున్నాడు. అందుకే డిసెంబ‌రు 6న ‘సైరా'కి ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబరు 6వ తేదీనుంచి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై మూవీ ‘సైరా నరసింహారెడ్డి' రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.

    న‌ర‌సింహారెడ్డి గెట‌ప్‌లోనే

    న‌ర‌సింహారెడ్డి గెట‌ప్‌లోనే

    ఆగస్టు 22న ఓపెనింగ్ జరిగిన ఈ చిత్రం ఇప్పటిదాకా షూటింగ్ కు సంబంధించిన కసరత్తులు చేస్తూనే ఉంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ చేశారు. మొద‌టి షాట్‌ని న‌ర‌సింహారెడ్డి గెట‌ప్‌లో ఉన్న చిరంజీవిపై చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌.

    న‌య‌న‌తార‌

    న‌య‌న‌తార‌

    న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్న ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది.

    ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు

    ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు

    2019 సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులకు కూడా ఎంపిక చేశారు.

    అంతే భారీగా ఎంపిక చేశారు

    అంతే భారీగా ఎంపిక చేశారు

    అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, నయనతార ఇలా భారీ తారాగణం ఉన్న ఈ సినిమాకి సాంకేతిక నిపుణులను కూడా అంతే భారీగా ఎంపిక చేశారు. ఎక్కడా రాజీ పడకుండా అన్నిట్లోనూ ది బెస్ట్ అనుకున్నదాన్నే ఎంపిక చేసుకుంటున్నారు. బడ్జెట్ విషయంలో కూదా మరింత పెరిగినా పర్లేదు అన్నంత పట్టుదలగా ఉన్నాడట రామ్ చరణ్.

    ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్

    ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్

    సెట్స్ మీదకు రావడమే.. ప్రారంభంలోనే ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ తోనే ప్రారంభించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు... ఓపెనింగ్ షెడ్యూల్ లో కంపోజ్ చేయాల్సిన యాక్షన్ సీన్లను రూపొందించడంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

     మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు

    మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు

    మెగాస్టార్ చాలా ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ చిత్రంలో వేర్వేరు భాషల చిత్ర పరిశ్రమల నుంచి అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి.. కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అలాగే ఇప్పటికి ఒక హీరోయిన్ గా నయనతార ఫైనలైజ్ కాగా మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలుసాగుతున్నాయి. ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో నటిస్తోంది.

    150 సినిమాల కెరీర్ లోనే

    150 సినిమాల కెరీర్ లోనే

    రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి 150 సినిమాల కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఒక రకంగా చూస్తే.. బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమలోనే ఇది హై బడ్జెట్ మూవీ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇన్ని రకాల స్పెషాలిటీలను పోగు చేసుకున్న చిరంజీవి ‘సైరా' డిసెంబరు 6నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళుతుండడం.. కొన్నినెలలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు శుభవార్తే.

    English summary
    The film, based on the life of India’s first freedom fighter Uyyalawada Narasimha Reddy and starring Chiranjeevi, will go on the floors in the first week of December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X