మెగా అభిమానులకు కన్నుల పండగే.. సైరా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది.. నిడివి ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' అక్టోబర్ 2 వ తేదీన గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఓ వైపున ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబీకులు ఆరోపణలు గుప్పిస్తుంటే.. మరోవైపు సైరా టీమ్ శరవేగంగా ప్రమోషన్స్ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సైరా నరసింహా రెడ్డి' సెన్సార్ సర్టిఫికెట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రయూనిట్. ఆ వివరాలు చూద్దామా..

సింగిల్ కట్ లేకుండా 'సైరా'
సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదలకు సంబందించిన పనులు వేగంగా పూర్తిచేస్తునారు. ఈ కోవలోనే తాజాగా చిత్ర సెన్సార్ రిపోర్ట్ తెలుపుతూ ట్వీట్ చేశారు యూనిట్ సభ్యులు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'సైరా' సింగిల్ కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ పొందింది. ఈ సర్టిఫికెట్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.

నిడివి కాస్త ఎక్కువే..
సైరా నరసింహా రెడ్డి సెన్సార్ సర్టిఫికెట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాల 50 సెకన్లు. అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పోల్చితే ఈ నిడివి కాస్త ఎక్కువే. కానీ షూట్ చేసిన సన్నివేశాలు, కథ మూలాలకు అనుగుణంగా ఈ మాత్రం నిడివి తప్పనిసరి అయిందని తెలుస్తోంది.

మెగా అభిమానులకు కన్నుల పండగే..
దాదాపు మూడు గంటల నిడివితో సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోందంటే అది కచ్చితంగా మెగా అభిమానులకు కన్నుల పండగే అని చెప్పుకోవచ్చు. అంతసేపు ఉయ్యాలవాడ వీరుడిగా చిరంజీవి కదనరంగంలో కదం తొక్కడం చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కినట్లే. పైగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ యుద్ధ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పేశాయి కూడా.
ప్యాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల్లో ఆతృత
సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా 'సైరా' పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆడియన్స్ అంతా సైరా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఏ రేంజ్‌లో విడుదలవుతోందో తెలుసా..?
విడుదలకు ముందే సైరా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఓ రేంజ్ బిజినెస్ చేసి రికార్డు నెలకొల్పింది సైరా. పైగా మునుపెన్నడూ లేనివిధంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తెలుగు సినిమా 'సైరా'నే కావడం విశేషం. అంటే సైరా రేంజ్ ఏంటో ఇక్కడే తెలుస్తోంది. ఇక సినిమా విడుదల తరువాత సంచలనాలు ఊహించగలమా!.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











