గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే: ఒళ్లు జలదరించే సీన్లతో ‘సైరా’ క్లైమాక్స్

Recommended Video

Iconic Climax For Sye Raa Narasimha Reddy || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇప్పటి వరకు ఆయన తన సినీ జీవితంలో 150 సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నింటినీ మించిపోయే బడ్జెట్, అద్భుతమైన కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది.

‘సైరా' క్లైమాక్స్ మార్చినట్లు ప్రచారం

‘సైరా' క్లైమాక్స్ మార్చినట్లు ప్రచారం

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో రియల్‌గా జరిగినట్లు కాకుండా... సినిమా కోసం కథ మార్చినట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తమన్నా ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ చేస్తోందని, ఆమె సైరా నరసింహారెడ్డిని చంపేస్తుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే అది నిజం కాకపోవచ్చని అంటున్నారు.

బ్రిటిషర్ల చేతిలో సైరాకు ఉరి

బ్రిటిషర్ల చేతిలో సైరాకు ఉరి

స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో జరిగిన కథతో ‘సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డిని అతి కష్టం మీద ఖైదు చేసి ఉరి తీస్తారు. ఇదే సినిమా క్లైమాక్స్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

అభిమానులు గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే

అభిమానులు గుండె నిబ్బరం చేసుకోవాల్సిందే

సాధారణంగా తెలుగు సినిమా క్లైమాక్సుల్లో హీరో చనిపోవడం లాంటి సంఘటనలు చాలా అరుదు. అలాంటి విషాదకర ముగింపును టాలీవుడ్ ప్రేక్షకులు ఇష్టపడరు. అయితే వాస్తవాన్ని వాస్తవంగా చూపించాలి కాబట్టి ‘సైరా' మూవీలో అలాంటి ముగింపు పెట్టక తప్పడం లేదు. ఈ విషయంలో అభిమానులు గుండె నిబ్బరం చేసుకుని వెళ్ళాల్సిందే.

ఒళ్లు జలదరించే సీన్లతో ‘సైరా' క్లైమాక్స్

ఒళ్లు జలదరించే సీన్లతో ‘సైరా' క్లైమాక్స్

దర్శకుడు సురేందర్ రెడ్డి ‘సైరా' మూవీ క్లైమాక్స్ ఒళ్లు జలదరించే ఎమోషనల్‌ సీన్లతో తనదైన స్టైల్‌లో తెరకెక్కించారట. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలెట్ అవుతుందని, ప్రేక్షకులు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేని విధంగా పతాక సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

‘సైరా నరిసింహారెడ్డి' చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్నివిడుదల కాబోతోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X