twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sye Raa: చిరంజీవి ఇంటి ముందు సూసైడ్ చేసుకొంటాం.. ఉయ్యాలవాడ వంశీయుల హెచ్చరిక

    |

    Recommended Video

    సైరా కి మద్దతు తెలుపుతున్న మరో వర్గం ఉయ్యాలవాడ వంశస్థులు || Sye Raa Narasimha Reddy Controversy ||

    మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఓ పక్క సైరా యూనిట్ గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, మరోపక్క ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు పెద్ద ఎత్తున ఆదోళనలకు దిగుతున్నారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఉయ్యాలవాడ వంశీయులు చిరంజీవి సహా 10 మందిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

    అప్పుడు అగ్రిమెంట్.. ఇప్పుడు మోసం

    అప్పుడు అగ్రిమెంట్.. ఇప్పుడు మోసం

    మా రక్తంతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. సినిమా కథ విషయంలో తమకు హక్కులు ఉంటాయని తాము డిమాండ్ చేయగా.. గతంలో కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తమతో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, తీరా సినిమా పూర్తయ్యాక మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

    రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలి

    రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలి

    సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు ఎవ్వరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ రామ్ చరణ్, చిరంజీవి బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని వారు పేర్కొన్నారు. వెంటనే రామ్ చరణ్, చిరంజీవిలపై కేసు నమోదు చేయాలని ఉయ్యాలవాడ వంశీయులు డిమాండ్ చేస్తున్నారు.

    నిర్మాత కేతిరెడ్డి సహకారంతో ముందుకు

    నిర్మాత కేతిరెడ్డి సహకారంతో ముందుకు

    తమ డిమాండ్స్‌ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సహకారం తీసుకుంటున్నారు ఉయ్యాలవాడ వంశీయులు. ఈ మేరకు నేడు (సెప్టెంబర్ 23) హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

    హైకోర్టులో పిటిషన్.. అమితాబ్ బచ్చన్ కూడా

    హైకోర్టులో పిటిషన్.. అమితాబ్ బచ్చన్ కూడా

    అప్పట్లో మా కుటుంబంతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడి నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని, ఆ ప్రకారంగా తమకు 50 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ 'సైరా నరసింహా రెడ్డి' యూనిట్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉయ్యాలవాడ వంశీయులు. ఈ పిటిషన్‌లో అమితాబ్ బచ్చన్ పేరు కూడా ప్రసావించడం విశేషం.

    రామ్ చరణ్ ఇంటికి పిలిచాడు.. ప్రధాన ఆరోపణ అదే

    రామ్ చరణ్ ఇంటికి పిలిచాడు.. ప్రధాన ఆరోపణ అదే

    'సైరా' సినిమాపై హై కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్, చిరంజీవి, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిని బాధ్యులుగా చేర్చారు. ఈ సినిమా మొదలు పెట్టే ముందే తమను వాళ్ళ ఇంటికి పిలిపించుకొని రామ్ చరణ్ సంతకాలు తీసుకున్నారని, ఆయన చరిత్రను తెలిపినందుకు గాను వారసులుగా తమకు సినిమా మార్కెట్‌లో 10 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ.

    చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్యలు చేసుకుంటాం

    చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్యలు చేసుకుంటాం

    ఇక ఇప్పటికైనా రామ్ చరణ్, చిరంజీవి స్పందించి తమకు ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలని కోరుతున్నారు ఉయ్యాలవాడ వంశీయులు. అలా జరగని పక్షంలో సినిమా విడుదల రోజే మూకుమ్మడిగా తామంతా చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్యలు చేసుకుంటామని వారు హెచ్చరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    సైరా నరసింహా రెడ్డి మూవీ

    కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Periodical drama Sye Raa Narasimhaa Reddy is ready for release on october 2. Since two days uyyalawada family members demanding compensetion from Konidela Production Company
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X