రాంచరణ్, చిరు పట్టించుకోవడం లేదు.. ఉయ్యాలవాడ వంశీయుల ఆవేదన, బ్రిటిష్ వారితో గొడవ!

Recommended Video

రోజుకో వివాదంలో చిక్కుకుంటున్న మెగాస్టార్ సినిమా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చుట్టూ వివాదాలు మొదలవుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు కర్నూలు జిల్లాలో ఉంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నివాసం ఉన్న ఇల్లు ఇప్పటికీ ఉంది. తమ వంశానికి చెందిన వీరుడి చరిత్రపై అంత భారీ స్థాయిలో సినిమా నిర్మిస్తూ కూడా తమని నామ మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ఆరోపిస్తున్నారు.

ఉయ్యాలవాడ కుటుంబీకుడు

ఉయ్యాలవాడ కుటుంబీకుడు

తమ వీరుడి చరిత్ర తెరకెక్కిస్తున్న చిరంజీవిని, రాంచరణ్ ని కలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాం అని దస్తగిరిరెడ్డి అన్నారు. దస్తగిరి రెడ్డి తండ్రి బాలిరెడ్డి. బాలిరెడ్డి తాతకు తాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. దస్తగిరితో పాటు ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు అంతా చిరంజీవిని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

పట్టించుకోవడం లేదు

పట్టించుకోవడం లేదు

చిరంజీవిని ఎప్పుడు కలుసుకోవాలని ప్రయత్నించినా మభ్యపెట్టే మాటలే తప్ప అవకాశం ఇవ్వడం లేదని దస్తగిరి అన్నారు. తమకు నరసింహారెడ్డి రూపంలో ఘనమైన చరిత్ర ఉన్నా పేదరికంలో ఉన్నామని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి ఉయ్యాలవాడ వీరత్వం గురించి వింటూ పెరిగానని అన్నారు.

డిమాండ్ ఒక్కటే

డిమాండ్ ఒక్కటే

తమ డిమాండ్ ఒక్కటే అని, ఉయ్యాలవాడ గురించి ఇంత భారీ స్థాయిలో సినిమా తీస్తున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులుగా తమని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బ్రిటిష్ వారితో గొడవ

బ్రిటిష్ వారితో గొడవ

ఉయ్యాలవాడ చరిత్ర మొత్తం ఆయన కుటుంబ సభ్యుడిగా తనకు తెలుసు అని దస్తగిరి తెలిపారు. ఉయ్యాలవాడకు చెందిన వేల ఎకరాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ ముష్టి పడేసినట్లు భరణం పడేసేవారు. అప్పుడే ఉయ్యాలవాడలో తిరుగుబాటు మొదలైందని దస్తగిరి తెలిపారు.

అవమానంతో

అవమానంతో

ఒకరోజు బ్రిటిష్ వారు ఇచ్చే భరణం తీసుకురమ్మని ఉయ్యాలవాడ తన కొడుకుని పంపిస్తాడు. నరసింహారెడ్డే మాకు పనిపనిషి.. మళ్ళీ వాడికి నువ్వొక పనిమనిషా అంటూ కొడుకుని అవమానించడంతో పోరాటం మొదలు పెట్టాలని ఉయ్యాలవాడ నిర్ణయించుకుంటాడు.

ఛాలెంజ్ విసిరిమరీ

ఛాలెంజ్ విసిరిమరీ

బ్రిటిష్ వారికీ ఛాలెంజ్ విసిరి మరీ చెప్పిన సమయానికి వారి ఖజానా కొల్లగొట్టే ధైర్యం, సాహసం ఉన్న యోధుడు ఉయ్యాలవాడ అని దస్తగిరి అన్నారు. అందరికంటే ఆసక్తిగా తాము సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాం అని ఉయ్యాలవాడ కుటుంబీకుడు దస్తగిరి తెలిపారు. ఆయన వంశానికి చెందినవారిగా తమకు తగిన ప్రాధాన్యత కల్పిస్తే చాలని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X