For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యూస్టన్‌లో సైరన్ మోగించిన సైరా... ఓవర్సీస్‌లో ఫీవర్ మొదలైంది

  |

  తెలుగు సినీ ప్రపంచంలో ప్రప్రధమంగా స్వతంత్ర ఉద్యమ నేపధ్యంతో భారీ తారాగణంతో రూపొందించిన మెగా మూవీ "సైరా నరసింహా రెడ్డి" సినిమాని ప్రమోట్ చేయడానికి అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో హ్యూస్టన్ మహానగరంలో మెగా అభిమానులు శ్రీ. రవి వర్రె మరియు శ్రీ. బద్రుద్ధీన్ పిట్టర్ గార్ల ఆధ్వర్యంలో హ్యూస్టన్ మెగా అభిమానులు గోదావరి రెస్టారెంట్లో సైరా ప్రమోషన్ కార్యక్రమం చేపట్టారు.

  ఈ కార్యక్రమానికి ముఖ్య అథిధిగా శ్రీ. ఉయ్యలవాడ శ్రీనివాసులు గారు హాజరయ్యారు. ఉయ్యలవాడ శ్రీనివాసులు గారు శ్రీ శ్రీ. ఉయ్యలవాడ బుద్ధా రెడ్డి గారి మునిమనవలు. శ్రీ. ఉయ్యలవాడ బుద్ధా రెడ్డి గారు ( బుద్ధన్న ) గారు శ్రీ. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారితో సహా బ్రిటీష్ సామ్రాజ్యంపై యుద్ధం జరిపినారు.

  sye raa narasimha reddy fever started overseas

  శ్రీ. రవి వర్రే గారు మాట్లాడుతూ, మెగా కుటుంబం తో తమ అనుబంధం, భీమవరం కాలేజి రోజుల్లో మెగా స్టార్ సినిమాల సందడి, మెగా టెక్సాస్ సినిమాస్ ఖైది 150 సందర్భంగా అమెరికా మొత్తం జరిపిన ప్రమోషన్, హ్యూస్టన్ నుండి ఆట్లాంటా ఖైది 150 బస్సు యాత్ర... మొదలగు విషయాలను పంచుకున్నారు.

  శ్రీ. బద్రుద్ధీన్ పిట్టర్ గారు మాట్లాడుతూ, ముందుగా సైరోత్సవాలకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి గురించి తన చిన్ననాటినుంచి తెలిసిన విషయాలు, తమ స్వస్థలం బనగానపల్లె, కోయిలకుంట్ల ప్రాంతాలలో ఉయ్యలవాడ వారి యుద్ధభూమి విశేషాలు వివరించారు.

  ఈ కార్యక్రమానికి అంట్లాంటా నుంచి విచ్చేసిన మెగాభిమాని శ్రీ. సాగర్ లగిశెట్టి గారు మాట్లాడుతూ, అనాటి ఖైది నుంచి నిన్నటి ఖైది 150, నేటి సైరా వరకూ మెగాస్టార్ చరిష్మా, తమ చిన్ననాటి మెగా అనుభూతులు, వైజాగ్ లో మెగాస్టార్ బెనిఫిట్ షో హడావిడ్లు అన్ని వివరించారు.

  sye raa narasimha reddy fever started overseas

  శ్రీ. కృష్ణారెడ్డి బయన గారు చారిత్రత్మకమైన ఈ స్వాతంత్రయోధ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

  శ్రీ. రాజేష్ యాళ్ళబండి గారు మాట్లాడురూ, "సైరా నరసింహా రెడ్డి" మెగా సినిమాని అమెరికాలో యాభై రాష్ట్రాల్లో మరియు అలస్కా, బహమస్, కరేబియన్ దీవులు, లాటిన్ అమెరికా దేశాలలో కూడ విడుదలవుతున్న ప్రప్రధమ సినిమా అని తెలియజేశారు. తెలుగు వాడి వేడి, ధీరత్వం మరియు దేశాభక్తిని తమిళ నాడు, కర్నాటక, కేరళ మాత్రమె కాకుండ ఉత్తర బారతదేశం, ప్రపంచానికి మొత్తం "సైరా నరసింహా రెడ్డి" మెగా సినిమా ద్వారా చాటుతున్నారని కొనియాడారు.

  sye raa narasimha reddy fever started overseas

  శ్రీ. గోపాల్ గూడపాటిగారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవిగారితో తన అనుబంధాన్ని, ఖైది 150 సినిమాకి హ్యూస్టన్ హంగామా, అదే రేంజ్ లో సైరా కూడ విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

  శ్రీ. అన్నపూర్ణ గారు మాట్లాడుతూ, చిరంజీవి గారి సినిమాలతో తమ అనుభంధం, "సైరా" మరో చరిత్ర సృష్టించాలని కోరారు.

  శ్రీ. వెంకట్ శీలం గారు, "సైరా నరసింహా రెడ్డి" చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

  శ్రీ. సురేష్ పగడాల తమ మెగా అభిమానాన్ని తెలియజేశారు. తమ కుటుంబానికి శ్రీ. ఉయ్యలవాడ శ్రీనివాసులు గారి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. సైరా సినిమా చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఈ సైరోత్సవాలకి ప్రధాన అతిధి శ్రీ. ఉయ్యలవాడ శ్రీనివాసులు గారు స్వాతంత్ర సమరంలో తమ కుటుంభం పాలుపంచుకున్న విషయాలను, తమ తాత ముత్తాతలనుండి శ్రీ. ఉయ్యలవాడ నరసింహ రెడ్డి గారి గురించి తమకు తెలిసిన విశేషాలను, స్వాతంత్ర సమరం సందర్భంగా మరియూ తదనంతరం తమ కుటుంబ పాత్రను వివరించారు. ఆ మహా యోధుడి వీరమరణాన్ని, వారి తలను ముప్పది సంవత్వరములు కోటకు వేలడదీయడము, స్వతంత్ర సమరయోధులకు వారి కుటుంబాలకు బ్రిటీష్ వారు భయానక వాతావరణం కల్పించడం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. 1800 ప్రాంతాలలో జరిగిన స్వాతంత్ర సమర విషయాలను విపులీకరించారు. శ్రీ. ఉయ్యలవాడ వారి జీవిత చరిత్రని తెరకెక్కిస్తున్న నిర్మాత శ్రీ. రాం చరణ్ తేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

  ఈ సైరోత్సవాలకి సహకరించిన సురేష్ సత్తి, శ్రీనివాస్ కిమిడి, మనోజ్ తోట, నాగు కూనసాని, చైతన్య కూచిపూడి, జై కుమర్ తన్నీరు, మల్లేశ్వర్ ఏనుగు, కళ్యాణ్ ఉప్పు, సుబ్బారావ్, గంగాధర్ మోసూరు, రాం పురం... మొదలుగు మెగా అభిమానులు ఈ సైరోత్సవాలకు సహాయమందించారు.

  English summary
  Paruchuri Gopalakrishna Revealed Fact for Not Attending Sye Raa Pre Release Event. Because If Illness He Didnot Attend This event. His Brother Paruchuri Venkateshwara Rao Wants To Get Oscar Award. Movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X