Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు దెబ్బకు రికార్డులు షేక్.. ఇండియాలోనే మొదటి స్థానంలో సైరా!
'ఖైదీ నెంబర్ 150' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
మేకింగ్ వీడియోతో మొదలెట్టేశారు
భారీ బడ్జెట్‌తో వస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి' ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. విడుదలకు తక్కువ వ్యవధి ఉండడంతో ఈ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 1.47 నిమిషాలున్న ‘సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేసింది.
|
వీడియోకు భారీ స్పందన
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా కావడంతో ఈ వీడియోకు కొద్ది సమయంలోనే విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన గంటలోనే దాదాపు రెండు లక్షల వ్యూస్ సంపాదించింది. మిగిలిన సామాజిక మాధ్యమాలు అన్నీ కలిపి మొత్తంగా డిజిటల్ వ్యూస్‌లో ఈ వీడియో మిలియన్ మార్కును అందుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్లో హవా
సైరా నరసింహారెడ్డి ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా పడిపోయింది. ఇది ట్విట్టర్ ట్రెండింగ్‌తో సుస్పష్టమైంది. #SyeRaaMaking ఇండియాలోనే ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, #SyeRaaNarasimhaReddy రెండో స్థానంలోనూ, #MegastarChiranjeevi, #RamCharan మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇలా ఒకే సినిమాకు సంబంధించిన నాలుగు ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉండడం అరుదనే చెప్పాలి.
టీజర్ రికార్డు బద్దలు కొడుతుందా?
కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ‘సైరా: నరసింహారెడ్డి' టీజర్ 24 గంటల్లోనే 7.1 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. తద్వారా అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్ల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రికార్డును మేకింగ్ వీడియో బద్దలు కొడుతుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం ఉన్న వేగం కంటిన్యూ అయితే అది సాధ్యమవుతుందని అంటున్నారు.
సైరా గురించి..
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.