సమర నినాదంతో సైరా.. 14న మేకింగ్ వీడియో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగకావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కాగా, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో రూపొందిన సినిమా కావడంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

స్వాతంత్ర్యపు దినోత్సవం రోజును పురస్కరించుకొని సైరా మేకింగ్ వీడియోను ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేస్తున్నట్టు కొణిదెల ప్రొడక్షన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఈ మేకింగ్ వీడియో ఉంటుందనే ప్రచారం జరుగుతున్నది.

Sye Raa Narasimha Reddy Making video on Augst 14.

సైరా చిత్రంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించడం సెన్సేషన్‌గా మారింది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు లాంటి ఎందరో సినీ ప్రముఖులు సైరా చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు. నయనతార చిరంజీవికి భార్యగా నటిస్తుండగా, నృత్యకారిణిగా తమన్నా నటించనున్నది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X