ఒళ్లు గగుర్బొడిచే సీన్లతో ‘సైరా’ మేకింగ్ వీడియో
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. మెగాస్టార్ కెరీర్లో అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది వరకు స్టార్ యాక్టర్లు భాగకావడంతో దేశవ్యాప్తంగా సైరాపై దృష్టిపడింది. అక్టోబర్ 2న దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం కావడంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

అబ్బుర పరుస్తున్న భారీ సెట్స్
1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఈ సెట్ల నిర్మాణం ఎలా జరిగింది అనేది ఈ మేకింగ్ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.
ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్ సీన్లు
సైరాలో యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉండబోతున్నాయి. యుద్ధ సన్నివేశాల చిత్రీకరించిన విధానం, దాని కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఫోకస్ చేశారు. సినిమాలోని పోరాట సన్నివేశాలు బాహుబలి రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.

మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్, నిహారిక కూడా...
ఈ మేకింగ్ వీడియోలో సైరా నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్న చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా పాత్రలను పరిచయం చేశారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్ కలిసిన సీన్ కూడా ఇందులో పొందు పరచడం గమనార్హం.

ఎవరు ఏ పాత్రలో...
చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్, చిరంజీవికి భార్యగా నయనతార,, నృత్యకారిణిగా తమన్నా నటిస్తోంది. అవుకు రాజు అనే యుద్ధ వీరుడిగా కిచ్చ సుదీప్, రాజ పాండ్యన్‌గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు.

సైరా నరిసంహారెడ్డి
చిరంజీవి పాత్రకు సంబంధించిన గెటప్ ఇప్పటికే అభిమానులను మెప్పించింది. ఇక నిర్మాత రాంచరణ్ ఈ సినిమాను అక్టోబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











