twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే మొదలైన లెక్కలు... ‘సైరా’ అక్కడ లాభాల్లోకి వెళ్లాలంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ ఎపిక్ మూవీ 'సైరా నరసింహారెడ్డి' అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రానికి సంబంధించిన చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేయబోతోంది, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోంది? అనేది హాట్ టాపిక్ అయింది.

    తెలుగు రాష్ట్రాల తర్వాత టాలీవుడ్ సినిమాలకు ప్రధానమైన మార్కెట్ నార్త్ అమెరికా. యూఎస్ఏ, కెనడాల్లో ఎక్కువ మంది ఇండియన్స్ సెటిలైన నేపథ్యంలో ఇక్కడ మన సినిమాలకు మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగింది. సైరా మూవీ ఇక్కడ ఎంత వసూలు చేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

    సైరా ఓవర్సీస్ రైట్స్

    సైరా ఓవర్సీస్ రైట్స్

    సైరా చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ గల్ఫ్‌కు చెందిన ‘ఫార్స్' అనే సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. గల్ప్ ఏరియాలో సొంతగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న ఈ సంస్థ నార్త్ అమెరికా, ఇతర ఓవర్సీస్ ఏరియాలకు రైట్స్ విడివిడిగా అమ్ముతోంది.

    నార్త్ అమెరికా హక్కులు ఎంతకు అమ్మారంటే?

    నార్త్ అమెరికా హక్కులు ఎంతకు అమ్మారంటే?

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నార్త్ అమెరికా హక్కులను స్నోఫ్లేక్ సినిమాస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. హక్కులు, ఇతర ఖర్చులతో సహా వీరు 1.80 మిలియన్(రూ. 13 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలి?

    లాభాలు రావాలంటే ఎంత వసూలు చేయాలి?

    నార్త్ అమెరికాలో ‘సైరా నరసింహారెడ్డి' మూవీ బ్రేక్ ఈవెంన్ పాయింటును అందుకోవాలంటే... కనీసం 3.40 మిలియన్ గ్రాస్ రాబట్టాలి. అప్పుడే సినిమా రిలీజ్ ఖర్చులు పోను వారికి పెట్టుబడి(షేర్) తిరిగి వస్తుందట. అయితే ‘సైరా' మూవీపై క్రేజ్ ఉండటంతో ఇది సాధ్యమే అంటున్నారు.

    మెగాస్టార్ గత చిత్రం ‘ఖైదీ నెం.150' ఎంత రాబట్టిందంటే?

    మెగాస్టార్ గత చిత్రం ‘ఖైదీ నెం.150' ఎంత రాబట్టిందంటే?

    మెగాస్టార్ గత చిత్రం ‘ఖైదీ నెం.150' నార్త్ అమెరికాలో 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో తాము ఈజీగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడంతో పాటు లాభాల బాట పడతామని అంతా భావిస్తున్నారు. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే... వాస్తవ లెక్కలు ఎలా ఉంటాయి అనేది సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేం.

    సైరా

    సైరా

    సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

    English summary
    Sye Raa Narasimha Reddy movie North America business details revealed. Rights of the film are bagged for 10.5 Cr by Snowflake Cinema.ye Raa Narasimha Reddy is an upcoming Indian Telugu-language biographical epic action film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. The film will be dubbed and released in Hindi, Kannada, Malayalam and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X