మున్నంగి హాసిని.. పాప చిన్నదే.. గళం పెద్దది.. సైరా అంటూ కదం తొక్కి ఆశ్చర్యపర్చింది
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా చేస్తుండగా.. మున్నంగి హాసిని అనే చిన్న పాప వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ పాప మాటలు చూసి అశేష మెగా అభిమాన వర్గం ఆశ్చర్యపోయింది.

వేదికపై వచ్చి రాగానే తన పేరు మున్నంగి హాసిని అని, తాను విజయవాడ ఐకాన్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నానని తనకు తాను పరిచయం చేసుకొని మాటల తూటాలు పేల్చేసింది. సైరా నరసింహా రెడ్డి గొప్పతనాన్ని పెద్దలకే సాధ్యం కాని భావజాలంతో చెప్పడంతో వేదిక ప్రాగణమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. చిరంజీవి, రామ్ చరణ్ పై అభిమానాన్ని చూపుతూ హాసిని మాటల తూటాలు అందరినీ అబ్బురపరిచాయి. దీంతో ఆమె మాటలు పూర్తికాగానే జయహో హాసిని అనేసి యాంకర్ సుమ ఆ పాపను ఆకాశానికెత్తేసింది.


Click it and Unblock the Notifications











