రాంచరణ్‌ను చూస్తే బాధేసింది.. చిరంజీవిని కౌగిలించుకొని ఏడ్చేశా.. సైరా ప్రీ రిలీజ్‌లో అల్లు అరవింద్

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేదిక వద్ద వాతావరణం కోలాహాలంగా మారింది. ఈ వేడుకలో అల్లు అరవింద్, వీవీ వినాయక్, కొరటాల శివ, సురేంద్ రెడ్డి మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

మొదటి ప్రేక్షకుడిని నేనే

మొదటి ప్రేక్షకుడిని నేనే

సైరా సినిమాకు పనిచేసిన వారు కాకుండా ఈ చిత్రాన్ని చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని. ఈ సినిమా సూపర్ హిట్. ఒక భయంతో సినిమా చూశాను. ఎప్పుడో కథ విన్నాను.. ఏం తీశారో అనే అనుమానం ఉండేది. ఆ సినిమా చూసిన తర్వాత చిరంజీవిని కౌగిలించుకొని ఏడ్చేశాను.

 రాంచరణ్‌ను ఎమోషనల్‌గా

రాంచరణ్‌ను ఎమోషనల్‌గా

సైరా సినిమా చూసిన తర్వాత రాంచరణ్‌ను చూస్తే బాధేసింది. చిరంజీవి కంటే రాంచరణ్‌పై నాకు ఎమోషనల్‌గా ఫీలింగ్ కలిగింది. చిరంజీవితో చాలా సినిమాలు చేశాను. కానీ ఇలాంటి సినిమాలు తీయలేకపోయాననే బాధగా ఉంది అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

రాంచరణ్‌ గ్రేట్

రాంచరణ్‌ గ్రేట్

అందరికీ నమస్కారం. సైరా సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం 250 రోజులు ప్రతీ ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నమ్మి నా చేతిలో పెట్టిన రాంచరణ్‌కు థ్యాంక్స్ అని సురేందర్ రెడ్డి అన్నారు.

చిరంజీవి ఉగ్ర నరసింహుడిగా

చిరంజీవి ఉగ్ర నరసింహుడిగా

మెగాస్టార్, పవర్ స్టార్, చరణ్ బాబు అభిమానులకు నా శుభాకాంక్షలు. వాతావరణం బాగా లేనందున ఎక్కువగా మాట్లాడను. ఓ షాట్ చేశాను. అందులో ఉగ్రనరసింహుడిలా కనిపించారు. ఈ సినిమా రాంచరణ్‌కు మంచి పేరు తీసుకురావాలి అని వీవీ వినాయక్ అన్నారు.

 రిలీజ్‌కు ముందే బ్లాక్‌బస్టర్ టాక్

రిలీజ్‌కు ముందే బ్లాక్‌బస్టర్ టాక్

అందరికీ నమస్కారం. సైరా షూటింగ్ జరుగుతుండగా రషెస్ చూశాను. చాలా బాగున్నాయి. ప్రొడక్షన్‌లో ఉండగానే బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి. సురేందర్ రెడ్డికి ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టమే. ఇలాంటి కావ్యాన్ని తెరకెక్కించే అవకాశం రావడం అరుదు. సాధారణంగా తండ్రి ప్రొడ్యూసర్ అయితే కొడుకు హీరో అవుతాడు. సైరా విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తండ్రి హీరో అయితే కొడుకు నిర్మాతగా మారాడు. నిజంగా రాంచరణ్‌ నిజంగా అదృష్టం అని కొరటాల శివ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X