బాహుబలి లేకపోతే సైరా లేదు.. దారి చూపింది రాజమౌళియే.. అసలు విషయం చెప్పిన చిరంజీవి

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ

చిరంజీవి మాట్లాడుతూ

సైరా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన భారత దేశం గర్వించదగిన డైరెక్టర్ రాజమౌళి గారికి, మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ గారికి, మంచి మెసేజ్ సినిమాలు తీసే కొరటాల శివ గారికి, ఇక్కడికి వచ్చిన వారందరికీ, నా రక్తం పంచుకుపుట్టిన పవన్ కళ్యాణ్‌కి, రక్తం పంచి నాకు తమ్ముళ్లయిన నా అభిమానులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు అని చెబుతూ ప్రసంగం ప్రారంభించారు.

సెప్టెంబర్ 22 నాకెంతో ప్రత్యేకం

సెప్టెంబర్ 22 నాకెంతో ప్రత్యేకం

సెప్టెంబర్ 22 తన జీవితంలో ల్యాండ్ మార్క్ అని చెప్పారు చిరంజీవి. 1978 ఇదే రోజు నా తొలి సినిమా ప్రాణం ఖరీదు రిలీజైన రోజు ఇది. ఆ రోజున నా తొలి సినిమా ప్రజల ముందుకు పోతోంది. ప్రజలు నన్నేమనుకుంటారు.. నా ఫ్యూచర్ ఏంటి? అనే మీమాంసలో ఉన్నాను. ఓ పక్క టెన్షన్, మరోపక్క ఎక్సయిట్‌మెంట్ ఇలా రకరకాల ఫీలింగ్స్ తో ఉన్నాను ఆ రోజు. మళ్ళీ అలాంటి ఫీలింగ్స్ ఈ రోజు కలుగుతున్నాయనేది వాస్తవం అని చెప్పారు చిరంజీవి.

ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర చేయాలనుకునే వాడిని

ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర చేయాలనుకునే వాడిని

తాను స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడినని చిరు అన్నారు. ఆ కథ భగత్ సింగ్ అని తాను అనుకున్నానని, కానీ పరుచూరి సలహా మేరకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా చేశానని చెప్పారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి నాకూ తెలియదు

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి నాకూ తెలియదు

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి తనకు తెలియదని, కానీ చరిత్రలో కనుమరుగైన ఆ యోధుడి కథను ప్రపంచానికి తెలియజేయాలని ఈ సినిమా చేశామని అన్నారు చిరంజీవి. పరుచూరి వారి సంకల్పం తోనే ఈ కథ చేయాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు చిరు.

 బడ్జెట్ సపోర్ట్ లేక ఆగిపోయింది

బడ్జెట్ సపోర్ట్ లేక ఆగిపోయింది

తనకు ఈ కథను పరుచూరి వారు 20 ఏళ్ళ క్రిందటే వినిపించారని, కానీ బడ్జెట్ సపోర్ట్ లేక, సరైన నిర్మాత రాక ఇన్ని రోజులు సినిమా తీయలేకపోయామని చిరు అన్నారు. అయితే ఈ రోజున మళ్ళీ ఈ సినిమా చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది.. ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి అని చెప్పారు చిరంజీవి.

బాహుబలి లేకపోతే సైరా లేదు

బాహుబలి లేకపోతే సైరా లేదు

రాజమౌళి గనక బాహుబలి తీసుండకపోతే ఈ రోజు సైరా నరసింహా రెడ్డి వచ్చి ఉండేది కాదు. మన తెలుగు సినిమాకి భారత వ్యాప్తిగా దారి చూపించారు రాజమౌళి. శభాష్.. బాహుబలి లాంటి పెద్ద సినిమాతో నిర్మాతలకు ఓ భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి అని చిరు అన్నారు. హ్యాట్సాఫ్ టూ రాజమౌళి అని సభా ముఖంగా చెప్పారు చిరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X