Sye Raa స్పెషల్.. పదేళ్ల తర్వాత ఆ ముగ్గురూ ఒకే వేదికపైకి.. ఇక రికార్డుల సునామీనే!

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వస్తున్నారు. ఇప్పటికే ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా చేయనుంది. అయితే ఈ వేడుకలో ఓ స్పెషల్ కూడా ఉంది.

Sye Raa Narasimha Reddy pre release event: Chiranjeevi, Ram Charan, Pavan Kalyan Surprise

మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ త్రయం ఒకే వేదికపైన కనిపించనుండటం విశేషం. గతంలో ఈ ముగ్గురూ కలిసి జల్సా, మగధీర వేదికలపై కన్పించగా.. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. సో ఈ లెక్కన సైరా నరసింహా రెడ్డి కూడా సూపర్ డూపర్ హిట్ ఖాయం అని ఇక్కడే తెలిసిపోతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డుల సునామీ సృష్టిస్తుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X