సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్: మెగా సంద్రంగా స్టేడియం, పాసులున్నా నో ఎంట్రీ.. ఆగ్రహంతో ఫ్యాన్స్..

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేదిక వద్ద వాతావరణం కోలాహాలంగా మారింది.

పృథ్వీ

పృథ్వీ

చిరంజీవికి జీవితాంతం నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఈ ఋణం తీరిపోదు. ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. నా సినిమా జీవితంలోనే ఈ క్యారెక్టర్ చాలు అని చెప్పాడు పృథ్వీ. అన్ని భాషల్లోనూ సైరా రికార్డుల సునామీ సృష్టిస్తుందని అన్నాడు.

 చిరంజీవి కోసమే

చిరంజీవి కోసమే

సైరా నర్సింహారెడ్డి సినిమా కథ పదేళ్ల కల. కల ఎప్పుడూ చెదిరిపోదు. కల కలగానే మిగిలిపోతుంది. కల చెదిరిపోకుండా నిలచిపోయినట్టే.. చిరంజీవి ఇంకా యువకుడిగా కనిపించడం మన అదృష్టం. ఈ సినిమా స్వాతంత్ర్య పోరాటం. న్యాయంగా చిరంజీవి కోసం చాలా మంది నటులు వదిలేసినట్టు నేను అనుకొంటాను. చాలా మంది వదిలేసిన తర్వాత చిరంజీవికి కథ చెబితే చేస్తానన్నారు. అందుకోసమే మేము ఎన్నో ఏళ్లుగా వేచి చూశాం అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.

ఏయే పాత్రలో అంటూ యాంకర్ సుమ

ఏయే పాత్రలో అంటూ యాంకర్ సుమ

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి, గోసాయిగా వెంకన్నగా అమితాబ్ బచ్చన్, సిద్దమ్మగా నయనతార, లక్ష్మీగా తమన్నా, అవుకురాజుగా కిచ్చ సుదీప్, రాజాపాండీగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, వసి రెడ్డిగా రవి కిషన్ నటిస్తున్నారని, ఇంతమంది తారాగణంతో ఇండియన్ సినిమాలోనే సరికొత్త పేజీకి శ్రీకారం చుట్టింది సైరా నరసింహా రెడ్డి అంటూ తన మాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించింది యాంకర్ సుమ.

అభిమానులు ఆగ్రహంతో

అభిమానులు ఆగ్రహంతో

సైరా వేడుక కోసం మెగా ఫ్యాన్స్, సినీ అభిమానులు భారీగా, వేలాదిగా తరలివచ్చారు. అయితే చాలా మంది ఎంట్రీ పాసులు ఉన్నా లోపలికి అనుమతించకపోవడంతో అసహానానికి గురయ్యారు. స్టేడియం మొత్తంగా నిండిపోవడంతో వీఐపీ పాసులు ఉన్నా లోపలికి వెళ్లకుండా గేట్లు మూసేయడంతో ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో వెళ్లిన వాళ్లు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగడం కనిపించింది.

ఒకే వేదికపై పవన్, చిరు, రాంచరణ్

ఒకే వేదికపై పవన్, చిరు, రాంచరణ్

మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ఈ త్రయం ఒకే వేదికపైన కనిపించనుండటం విశేషం. గతంలో ఈ ముగ్గురూ కలిసి జల్సా, మగధీర వేదికలపై కన్పించగా.. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. సో ఈ లెక్కన సైరా నరసింహా రెడ్డి కూడా సూపర్ డూపర్ హిట్ ఖాయం అని ఇక్కడే తెలిసిపోతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డుల సునామీ సృష్టిస్తుందో!

మెగా హీరోలందరూ వేదికపై

మెగా హీరోలందరూ వేదికపై

ఇక సైరా మూవీ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ విచ్చేస్తుండగా.. మిగిలిన మెగా హీరోలంతా ఈ వేదికపై కనిపించనున్నారు. మరికొద్ది సేపట్లోనే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ వేదిక వద్దకు చేరుకోనున్నారు. దీంతో ఒకే వేదికపై ఈ మెగా హీరోలను చూడాలని ఆతృతగా ఉన్నారు మెగా అభిమానులు.

మెగా సంద్రంగా మారిన ఎల్బీ స్టేడియం

మెగా సంద్రంగా మారిన ఎల్బీ స్టేడియం

సైరా ఆడియో వేదిక మెగా సముద్రంగా మారింది. అన్ని వైపుల ఎల్బీ స్టేడియం జనంతో కక్కిరిసిపోయింది. ఆరంభంలో సాంస్కృతిక కార్యక్రమాలు, చిరంజీవి పాటలతో కూడిన నృత్యాలు ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X