ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా.. చిరంజీవిని కొట్టేయ్యలేరు.. పవన్ కల్యాణ్ ఎమోషనల్

సైరా వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు. సైరా వేడుకలో మాట్లాడుతూ.. అతిథిగా పిలిచినందుకు చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. ఈ వేదికపైన నేను మీలో ఒకడిగా మాట్లాడుతాను. అన్నయ్య ఫంక్షన్‌కు వస్తే నేను అభిమానిగానే వస్తాను. అభిమానిగానే మాట్లాడుతాను. అన్నయ్య 151 సినిమా చేస్తే.. పోటీతత్వంలో ఉండే పరిశ్రమలో అందరూ వచ్చి ఈ వేదికపై హాజరయ్యారు. అందుకు కారణం చిరంజీవిలో ఉండే మంచితనమే అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉద్వేగంగా మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే..

అన్నయ్య అంటే ఎందుకిష్టమంటే..

అన్నయ్య అంటే ఎందుకిష్టమంటే..

అన్నయ్య అంటే నాకు ఎందుకు ఇష్టమంటే.. నా జీవితాన్ని తీర్చి దిద్దిన వ్యక్తి కావడం. అన్నయ్యను చూస్తే తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు గుర్తొచ్చింది. ఆయన లాంటి వ్యక్తి ఉంటే ఆత్మహత్యలు జరగకపోయి ఉండేదేమో అనిపిస్తుంది. ఫెయిల్యూర్ ఎంత బాధకలిగిస్తుందో నాకు తెలుసు.

పిస్టల్ తీసుకొని కాల్చుకొందామని

పిస్టల్ తీసుకొని కాల్చుకొందామని

ఇంటర్ పరీక్ష ఫెయిల్ అయితే అన్నయ్య పిస్టల్ తీసుకొని కాల్చుకొందామనుకొన్నాను. వదిన, అన్నయ్యలు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. మార్కులు, పాస్, ఫెయిల్ కొలమానం కాదని మనోధైర్యాన్ని నింపారు. ఆ ధైర్యం, గుండెబలం నన్ను మిముందు నిలబెట్టింది. అందుకే ఆయనను ఓ మహనీయుడిగా, గొప్ప వ్యక్తిగా చూస్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

దేశం గర్వించదగిన వ్యక్తిగా చిరంజీవి

దేశం గర్వించదగిన వ్యక్తిగా చిరంజీవి

అన్నయ్య చిరంజీవిని దేశం గర్వించే దగ్గ వ్యక్తిగా చూడాలని కోరుకొనే వాడిని. అలాంటి కోరికను నేను తీర్చుకోలేకపోయాను. నాకు స్టార్ డమ్ వచ్చినా నేను చేయలేకపోయాను. కానీ నా కళ్ల ముందు పుట్టి పెరిగిన రాంచరణ్ చేయడం గొప్ప విషయం. స్వార్థం చూసుకోకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా తీసిన రాంచరణ్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని పవన్ అన్నారు.

 దేశ గొప్పతనాన్ని చూపే సినిమా

దేశ గొప్పతనాన్ని చూపే సినిమా

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రం భారతదేశం గొప్పతనాన్ని తెలియజేప్పే సినిమా. మన దేశంపై ఏన్నో దేశాలు దాడి చేశాయి. మన దేశం ఎప్పుడు ఇతర దేశాలపై దాడి చేయలేదు. భారతదేశం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం. స్వతంత్ర్య పోరాటం గురించి తెలియాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. భగత్ సింగ్, ఆజాద్, గాంధీ లాంటి పోరాట యోధుల గురించి ప్రతీ ఒక్కరికి తెలియాలి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అనుభవాన్ని తక్కువ చేయలేం

అనుభవాన్ని తక్కువ చేయలేం

ఖైదీ తర్వాత చిరంజీవి గొప్ప స్టార్ అని ఫీల్ అయ్యేవాడిని. అన్నయ్య స్టార్ అని పోయే వాడిని. అన్నయ్య రికార్డుల గురించి గొప్పగా ఊహించుకొనే వాడిని. కానీ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర సినిమా వచ్చిన తర్వాత అన్ని రికార్డులు తుడుచుపెట్టుకుపోయాయి. అప్పుడు నాకు తెలిసింది. రికార్డులు కాదు.. వ్యక్తుల అనుభవం ముఖ్యమని, అనుభావాన్ని తక్కువ చేయకూడదని తెలుసుకొన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.

ఎన్ని రికార్డులు ఉన్నా

ఎన్ని రికార్డులు ఉన్నా

సినిమా పరిశ్రమలో ఎన్ని రికార్డులు ఉన్నా.. తుడిచిపెట్టుకుపోవడం కామన్. ఇండస్ట్రీలో ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా.. రికార్డులు బద్దలు కొట్టినా గానీ.. అన్నయ్య చిరంజీవి అనుభవాన్ని కొట్టేయలేం. అలాంటి వ్యక్తి ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి లాంటి చారిత్రాత్మక, దేశం గర్వించే సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

జనగణ మన గీతానికి గౌరవం తెచ్చేలా

జనగణ మన గీతానికి గౌరవం తెచ్చేలా

నేను అన్నయ్య సినిమా శుభలేఖకు తొలిసారి డబ్బింగ్ చెప్పాను. మళ్లీ సైరాకు గొంతు ఇచ్చాను. రెండు రోజుల క్రితం సైరాకు డబ్బింగ్ చెప్పాను. జనగణ మన గీతాన్ని గౌరవం తెచ్చే డబ్బింగ్ చెప్పాను. సినిమా చివర్లో జనగణ మన గీతానికి లేచి నిలబడేలా ఉండే సీన్ కోసం డబ్బింగ్ చెప్పాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X