చిరంజీవికి జీవితాంతం నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఈ ఋణం తీరిపోదు: 30 ఇయర్స్ పృథ్వీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది.

వేదికపై రామ్ లక్ష్మణ్

వేదికపై రామ్ లక్ష్మణ్

ముందుగా మాకీ ఛాన్స్ ఇచ్చినందుకు రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డికి, అందరు టెక్నీషియన్స్‌కి కృతజ్ఞతలు చెబుతున్నాం. పాత రికార్డ్స్ నరికేసి సరికొత్త రికార్డ్స్ సృష్టించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

ప్రపంచ రికార్డులనే నరికి సరికొత్త ఒరవడికి శ్రీకారం

ప్రపంచ రికార్డులనే నరికి సరికొత్త ఒరవడికి శ్రీకారం

ఎమోషనల్ సీన్స్‌కి, ఎమోషనల్ ఫైట్స్‌కి మమ్మల్ని చూసే చేసుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ రికార్డులనే నరికి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు సైరా నరసింహా రెడ్డి అని అన్నారు రామ్ లక్ష్మణ్.

30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ

30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ

తన క్యారెక్టర్ పేరు మాధవయ్యర్ అని చెప్పిన 30 ఇయర్స్ పృథ్వీ.. సైరా నరసింహా రెడ్డి అని పెద్దగా అరిచారు. సైరాలో నటించే అవకాశం రావడమే తనకు ఆస్కార్ అవార్డు అని చెప్పారు 30 ఇయర్స్ పృథ్వీ. అన్నయ్య గొప్పతనాన్ని చెప్పే ఓ అద్భుతమైన అవకాశం నాకిచ్చారని అన్నారు.

నా సినిమా జీవితంలోనే ఈ క్యారెక్టర్ చాలు

నా సినిమా జీవితంలోనే ఈ క్యారెక్టర్ చాలు

చిరంజీవికి జీవితాంతం నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఈ ఋణం తీరిపోదు. ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. నా సినిమా జీవితంలోనే ఈ క్యారెక్టర్ చాలు అని చెప్పాడు పృథ్వీ. అన్ని భాషల్లోనూ సైరా రికార్డుల సునామీ సృష్టిస్తుందని అన్నాడు.

 సైరా డైలాగులతో హోరెత్తిస్తూ

సైరా డైలాగులతో హోరెత్తిస్తూ

ఇంటర్వెల్ టైమ్ లో తాను చెప్పే డైలాగ్ ఇదే అంటూ గొంతెత్తి ఆ డైలాగ్ చెప్పాడు పృథ్వీ. ఇక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని చెప్పాడు పృథ్వీ. ఈ సందర్బంగా కొరటాల శివను ఓ అవకాశం ఇవ్వాలంటూ సభా ముఖంగా అడిగాడు పృథ్వీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X