స్టేజ్‌పై చెప్పిన కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియజెప్పలేవు.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది.

వర్షం కారణంగా ఊహించని అంతరాయం

వర్షం కారణంగా ఊహించని అంతరాయం

సక్సెస్ ఫుల్‌గా ఈవెంట్ రన్ అవుతుండగా వర్షం రూపంలో అనుకోని అంతరాయం కలిగింది. దీంతో ఈవెంట్ కి వచ్చిన సినీ ప్రముఖులందరినీ వేదికపైకి ఆహ్వానించి త్వరత్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ..

రామ్ చరణ్ మాట్లాడుతూ..

అందరికీ నమస్కారం. ఇండస్ట్రీ పెద్దలకు, మా అభిమానులందరికీ, పవర్ స్టార్ అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ రామ్ చరణ్ తన స్పీచ్ మొదలు పెట్టాడు. వర్షం కారణంగా తన స్పీచ్ త్వరగా పూర్తి చేస్తున్నానని చెబుతూ కాసింత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు రామ్ చరణ్.

కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియజెప్పలేవు

కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియజెప్పలేవు

చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరునా కృతజ్ఞలు చెప్పిన చెర్రీ.. నేను ఎంత థాంక్స్ చెప్పినా ఈ స్టేజ్ పై చెప్పిన కొన్ని మాటలు నా లోపలి భావాలను తెలియజెప్పలేవు. 200 రోజులు షూట్ చేశాము.. ప్రతీ రోజు వారికి నేను కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను. నాన్న గారి డ్రీం ప్రాజెక్టు అయిన ఈ సినిమా వీళ్ళంతా లేకుంటే తనకు సాధ్యమయ్యేది కాదని అన్నారు రామ్ చరణ్.

నాన్న గారిని, బాబాయ్‌ని ఎక్కువ సేపు నిల్చోబెట్టలేను

నాన్న గారిని, బాబాయ్‌ని ఎక్కువ సేపు నిల్చోబెట్టలేను

ఆ తర్వాత నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ఇలా నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పిన చెర్రీ.. నాన్న గారిని, బాబాయ్‌ని ఎక్కువ సేపు నిల్చోబెట్టలేను అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X