సైరా ఈవెంట్.. సాయి ధరమ్ కంగారుగా ఉందంటే.. వరుణ్ తేజ్ వణుకు వస్తోందని అన్నారు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

కిటకిటలాడుతున్న ఎల్‌బీ స్టేడియం

హైదరాబాద్ లోని ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పెద్ద ఎత్తున మెగా అభిమాన వర్గం తరలి వచ్చారు. ఎల్‌బీ స్టేడియం అంతా మెగా అభిమానులతో కిటకిటలాడుతోంది. ఈ వేడుకకు సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తూ సైరా విశేషాలు చెబుతోంది.

వర్షం కారణంగా ఊహించని అంతరాయం

వర్షం కారణంగా ఊహించని అంతరాయం

సక్సెస్ ఫుల్‌గా ఈవెంట్ రన్ అవుతుండగా వర్షం రూపంలో అనుకోని అంతరాయం కలిగింది. దీంతో ఈవెంట్ కి వచ్చిన సినీ ప్రముఖులందరినీ వేదికపైకి ఆహ్వానించి త్వరత్వరగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ

''అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందిరికీ నమస్కారం. ఇంత వర్షం పడుతుంటే కూడా మీ జోష్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా స్టేజ్ మీద చిరంజీవి గారి ముందు, కళ్యాణ్ గారి ముందు మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అలాగే కంగారుగా కూడా ఉంది'' అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు.

 చరణ్ నువ్వు చేసిన పని

చరణ్ నువ్వు చేసిన పని

సైరా చిత్రయూనిట్ యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. చరణ్ నువ్వు మీ ఫాదర్ డ్రీమ్ మాత్రమే కాదు.. మా అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ ఫిల్ చేశావు. సైరా ట్రైలర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ ప్రసంగం ముగించారు సాయి ధరమ్.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. వణుకు వస్తోంది అంటూనే

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. వణుకు వస్తోంది అంటూనే

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వీళ్లందరి ముందు మాట్లాడాలంటే వణుకు వస్తోంది అని వరుణ్ అన్నాడు. చిరంజీవి 152 సినిమాలు చేసినా ఇలాంటి సినిమాలు చేయలేదు. చరణ్ లాంటి కొడుకు ఉన్నందుకు నాన్నగారు గర్వపడుతుంటారు. అలాంటి అన్న ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ సినిమా ప్రతీ భారతీయుడు గర్వపడే సినిమా అవుతుందని అన్నాడు వరుణ్ తేజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X