సైరా సెన్సేషన్: ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు.. చిరు కెరీర్‌లోనే ఎన్నడూ లేని..

ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్న సైరా నర్సింహారెడ్డి సినిమా రిలీజ్‌కు ముందే పలు సంచలనాలకు వేదికగా నిలుస్తున్నది. టీజర్లు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలు సోషల్, డిజిటల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలు రికార్డులను క్రియేట్ చేస్తూ సైరాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే సైరా రిలీజ్, ప్రీమియర్ షోల గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకు ఆ విషయం ఏమిటంటే..

అన్ని భాషల్లోనూ ఆదరణ

అన్ని భాషల్లోనూ ఆదరణ

సైరా హిందీ టీజర్‌ను ముంబైలో మంగళవారం (ఆగస్టు 20న) భారీ రేంజ్‌లో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ పరిశ్రమ అంతా ఓ సారి సైరాపై, చిరంజీవిపై కన్నేసే విధంగా చేసింది. అన్ని భాషల్లోనూ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ముంబై ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో సైరా ట్రెండింగ్‌గా మారింది.

20 లక్షల వ్యూస్‌తో

20 లక్షల వ్యూస్‌తో

సైరా టీజర్‌‌కు అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ 20 మిలియన్ల వ్యూస్‌కు పైగా సొంతం చేసుకొన్నది. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే టీజర్ 10 మిలియన్ల వ్యూస్ రాబట్టడం సినిమాపై క్రేజ్ చెప్పకనే చెప్పింది. ఇలాంటి క్రేజ్ చిరంజీవికి రావడంతో బిజినెస్ పరంగా కూడా ప్రభావం పడే అవకాశాలు స్పష్టమయ్యాయి.

అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా

అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా

ఇక సైరా సినిమాను గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాలని డేట్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్లను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే వర్కవుట్ అయితే చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సైరా నిలిచే అవకాశం లేకపోలేదు.

 కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రికార్డు ధరకు

కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రికార్డు ధరకు

ఇక తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే, హిందీ, ఇతర రాష్ట్రాల్లో సైరా బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నది. కర్ణాటక థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి డిస్టిబ్యూటర్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం. కన్నడ వెర్షన్‌లో ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ, మలయాళంలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X