‘సైరా’ను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో.. దుమ్ము దులపడం ఖాయం.. ఖుషీలో చిత్ర యూనిట్

Recommended Video

‘సైరా’ను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో.. దుమ్ము దులపడం ఖాయం!!

'సైరా'ను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో.. దుమ్ము దులపడం ఖాయం.. ఖుషీలో చిత్ర యూనిట్
రెండేళ్ల క్రితం 'ఖైదీ నెంబర్ 150'తో తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో చిరు నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను కూడా రాబట్టిందీ సినిమా. ఇక, ఈ సినిమా తర్వాత కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ వార్త చిత్ర యూనిట్‌లో ఖుషీని నింపుతోంది.

ప్రమోషన్ షురూ

ప్రమోషన్ షురూ

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మిగిలిన పనులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం (14) నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతుంది.

మేకింగ్ వీడియోతో మొదలు

మేకింగ్ వీడియోతో మొదలు

సైరా సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు ‘సైరా' మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. దీంతో దీనిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హిందీ హక్కులు కొన్న హీరో

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైరా'ను హిందీలో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ విడుదల హక్కులను ప్రముఖ బాలీవుడ్ హీరో, నిర్మాత ఫర్హాన్ అక్తర్ కొనుగోలు చేశారు. ఆయన, రితేష్ సిద్వానికి చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్, అనిల్ తాదానికి చెందిన ఎఎ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ‘సైరా' హిందీ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ ట్వీట్ చేసింది. అంతేకాదు, ‘సైరా'లోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

ఇద్దరు మెగాస్టార్స్‌పై నమ్మకం

ఇద్దరు మెగాస్టార్స్‌పై నమ్మకం

హిందీ హక్కుల కోసం సదరు సంస్థలు భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈ సినిమాలో ఇద్దరు మెగాస్టార్స్ ఉండడమే. అందులో ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కాగా, మరొకరు చిరంజీవి. వీరిద్దరి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది.

సైరా గురించి..

సైరా గురించి..

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X