‘సైరా’ షూటింగ్ పూర్తి: బిగ్ బి, కిచ్చా సుదీప్, సురేందర్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్స్
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. మెగాస్టార్ కెరీర్లో మాత్రమే కాదు... తెలుగు సినిమా హిస్టరీలోని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇదీ ఒకటిగా నిలవబోతోంది.
ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతో పాటు కన్నడ స్టార్ సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఇలా అన్ని భాషల నుంచి ప్రముఖ నటులను ఇందులో భాగం చేయడం ద్వారా దీన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి.
షూటింగ్ పూర్తయింది, బిగ్ బి ఎమోషనల్ ట్వీట్
మార్చి 16తో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా బిగ్ బి అమితాబ్ విమానంలో ముంబై బయల్దేరుతున్న ఫోటోను అభిమానులతో పంచుకోవడంతో పాటు ‘ఎంతో సంతృప్తిగా ఫీలవుతున్నాను' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
పదేళ్ల తర్వాత మళ్లీ...
సైరా సెట్స్‌లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి దిగిన ఫోటోను సుదీప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ‘రాన్ మూవీ తర్వాత పదేళ్లకు లెజెండ్ అమితాబ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది. ఆయన తన జీవితంలో ఎక్కువ సమయం సినిమా రంగానికి సేవచేయడానికి, మనల్ని ఎంటర్టెన్ చేయడానికే కేటాయించారు. నాకు ఇలాంటి మూమెంట్స్ గిఫ్టుగా అందడానికి కారణమైన సైరా చిత్రానికి, రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి థాంక్స్' అని వ్యాఖ్యానించారు.
సురేందర్ రెడ్డి ట్వీట్
‘సైరా' చిత్రం సురేందర్ రెడ్డి కెరీర్లో అతిపెద్ద, ల్యాండ్ మార్క్ మూవీ. ఈ సినిమా ద్వారా అమితాబ్, చిరంజీవి లాంటి గ్రేట్ యాక్టర్లతో పని చేసే అవకాశం దక్కడంపై చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ‘అమితాబ్ బచ్చన్ షూటింగ్ పూర్తయింది. ఆయనతో జర్నీ అమేజింగ్, ఇంక్రెడబుల్. ఈ సినిమా ద్వారా ఆయనతో పని చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. సీనియర్ బచ్చన్‌తో పని చేయాలనే నా కల నిజమైంది' అంటూ ట్వీట్ చేశారు.

సైరా నరసింహారెడ్డి
‘సైరా నరసింహారెడ్డి' చిత్రం దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తుండగా.. ఆయన భార్య పాత్రలో నయనతార నటిస్తున్నారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











