మెగా‌స్టార్ ఉగ్రరూపం:‘సైరా నరసింహారెడ్డి’ టీజర్

By Bojja Kumar

Recommended Video

సైరా నరసింహారెడ్డి టీజర్

మెగా అభిమానులు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సైరా నరసింహారెడ్డి' టీజర్ రానే వచ్చింది. రేపు (ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే టీజర్ విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతోందని సైరా టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ మెగాస్టార్ ఉగ్రరూపం చూసినట్లు ఉందని అంటున్నారు.

చిరంజీవి లుక్ సూపర్బ్

చిరంజీవి లుక్ సూపర్బ్

వారియర్ సైరా నరసింహారెడ్డి గెటప్‌లో చిరంజీవి లుక్ అద్భుతంగా ఉంది. 60 ఏళ్ల పైచిలుకు వయసులోనూ ఆయన ఇంత ఎనర్జిటిక్‌గా తెరపై కనిపించడం, పోరాట సన్నివేశాల్లో నటించడం అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇండియా అన్‌సంగ్ హీరో

ఇండియా అన్‌సంగ్ హీరో

1800 ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన వీరుడి పాత్రలో చిరంజీవి అభిమానులను అలరించబోతున్నారు.

బ్రిటిషర్ల అకృత్యాలు

బ్రిటిషర్ల అకృత్యాలు

బ్రిటిషర్ల అకృత్యాలు, అన్యాయాలను ఫోకస్ చేస్తూ..... వారికి వ్యతిరేకంగా నరసింహారెడ్డి చేసిన స్పూర్తిదాయక తిరుగుబాటు సన్నివేశాలు సినిమాల హైలెట్‌గా ఉండబోతున్నాయి. చిరంజీవి కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.

రియాల్టీ ఉట్టిపడేలా సెట్స్

రియాల్టీ ఉట్టిపడేలా సెట్స్

1800 కాలం నాటి పరిస్థితుకు అద్దం పట్టేలా వేసిన సెట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వబోతున్నాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ తీర్చి దిద్దారు.

రత్నవేలు సినిమాటోగ్రఫీ

రత్నవేలు సినిమాటోగ్రఫీ

ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇండియాలోని ది బెస్ట్ కెమెరామెన్లలో ఒకరైన ఆయన సైరా నరసింహుడి ఉగ్రరూపం తన లెన్సులో మరింత అద్భుతంగా ఫోకస్ చేశారని స్పష్టమవుతోంది.

అమిత్ త్రివేది మ్యూజిక్

అమిత్ త్రివేది మ్యూజిక్

ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో ఉడాన్, వేక్‌ అప్‌ సిద్, ఐషా, దేవ్‌ డి, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, ఇషక్‌ జాదే, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, బాంబే వెల్వెట్‌, ఉడ్తా పంజాబ్‌, క్వీన్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తాజాగా సైరా టీజర్‌కు అతడు అందించిన సంగీతం సూపర్బ్ అనేలా ఉంది.

టీజర్

చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X