twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ టీజర్ సరికొత్త రికార్డ్... 24 గంటల్లో ఎవరూ ఊహించని అలజడి!

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' టీజర్ టెర్రిఫిక్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు టీజర్ విడుదల చేయగా.... 24 గంటల్లో 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. దీంతో 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించి తెలుగు టీజర్‌గా సైరా రికార్డులకెక్కింది.

    కేవలం ఒక్క యూట్యూబ్‌లోనే ఇది 7.3 మిలయన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇతర సోషల్ మీడియా మాధ్యమాలన్నింటిలో కలిపి 24 గంటల్లో మొత్తం 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది.

    Sye Raa Narasimha Reddy teaser 12 Million Digital Views

    బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ. 150 కోట్ల పై చిలుకు బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

    హిస్టారికల్ ఎపిక చిత్రాన్ని సౌతిండియా అన్ని లాంగ్వేజ్‌లతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి ఆలిండియా సూపర్ స్టార్‌ను ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో చూపించబోతుండటం సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ అని స్పష్టమవుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా లాంటి వారు కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.

    ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ రత్నవేలు, అమిత్ త్రివేది, రాజీవన్, కమల్ కణ్ణన్‌తో పాటు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019లో 'సైరా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    The teaser of Chiranjeevi’s ‘Sye Raa Narasimha Reddy’ has raked in more than 12M digital views in 24 hours. The teaser has raked in more than 7.3M views on YouTube alone. The teaser sees Chiranjeevi essaying the role of freedom fighter Uyyalawada Narasimha Reddy, accessorised with a deadly sword.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X